Sunrisers Hyderabad : దేశం మారినా సన్ రైజర్స్ రాత మారలేదు.. పాపం కావ్య మేడంకు అక్కడ కూడా నిరాశే
Sunrisers Hyderabad : దేశం మారినా సన్ రైజర్స్ రాత మారలేదు.. పాపం కావ్య మేడంకు అక్కడ కూడా నిరాశే
SAT20: ముంబై ఇండియన్స్, రాజస్తాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీలు సౌతాఫ్రికా టి20 లీగ్ లో జట్లను కొనుగోలు చేశాయి.
దక్షిణాఫ్రికా (South Africa) వేదికగా సౌతాఫ్రికా టి20 లీగ్ ఆరంభమైన సంగతి తెలిసిందే. పేరుకే ఇది సౌతాఫ్రికా లీగ్ అయినా.. ఇందులోని ఆరు జట్లు కూడా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో ఆడుతున్న ఫ్రాంచైజీలవే కావడం విశేషం.
2/ 7
ముంబై ఇండియన్స్, రాజస్తాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీలు సౌతాఫ్రికా టి20 లీగ్ లో జట్లను కొనుగోలు చేశాయి.
3/ 7
ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు.. సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ పేరుతో బరిలోకి దిగింది. 2021 నుంచి సన్ రైజర్స్ హైదరాబాద్ పేలవ ప్రదర్శన చేస్తుంది. 2021 ముందు వరకు ఐపీఎల్ లో అత్యంత నిలకడైన జట్టుగా ఉన్న సన్ రైజర్స్ గత రెండు సీజన్ల నుంచి పేలవ ప్రదర్శన చేస్తుంది.
4/ 7
ఇక సౌతాఫ్రికా టి20లీగ్ లో కూడా సన్ రైజర్స్ రాత మారలేదు. ప్రిటోరియా క్యాపిటల్స్ (ఢిల్లీ క్యాపిటల్స్)తో జరిగిన ఆరంభ పోరులో 23 పరుగుల తేడాతో సన్ రైజర్స్ ఓడింది.
5/ 7
తొలుత బ్యాటింగ్ చేసిన ప్రిటోరియా క్యాపిటల్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 193 పరుగులు చేసింది. కెప్టెన్ మార్కరమ్, బార్ట్ మన్ లు చెరో రెండు వికెట్లు తీశారు. మార్కో యాన్సెన్ ఒక వికెట్ సాధించాడు.
6/ 7
అనంతరం ఛేదనకు దిగిన సన్ రైజర్స్ జేజే స్మట్స్ శుభారంభం చేశాడు. 51 బంతుల్లోనే 66 పరుగులు చేశాడు. టామ్ అబెల్ (40 నాటౌట్) రాణించాడు. ట్రిస్టన్ స్టబ్స్ (23) ఫర్వాలేదనిపించాడు.
7/ 7
అయితే ఆశలు పెట్టుకున్న కెప్టెన్ మార్కరమ్ చేతులెత్తేశాడు. దాంతో సన్ రైజర్స్ లక్ష్యానికి చేరువగా వచ్చి ఆగిపోయింది. మిడిలార్డర్ వైఫల్యంతో పాటు కీలక సమయాల్లో వికెట్లు కోల్పోవడం సన్ రైజర్స్ విజయావకాశాలను దెబ్బ తీశాయి. దాంతో సన్ రైజర్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 170 పరుగులు మాత్రమే చేయగలిగింది.