వచ్చే సిరీస్ లలో రోహిత్ భారీ ఇన్నింగ్స్ ఆడకపోతే టీంలో అతడి స్థానం ప్రశ్నార్థకంగా మారనుంది. కెప్టెన్ గా ఉన్న రోహిత్ ను ఎలా తప్పిస్తారు అనే ప్రశ్న అతడి అభిమానులకు తలెత్తొచ్చు. కానీ, మొన్నటి వరకు వన్డేలకు కెప్టెన్ గా వ్యవహరించిన శిఖర్ ధావన్ వేటుకు గురైన విషయాన్ని మర్చిపోకూడదు.