వరుసగా 4 సిరీస్‌ల్లో ప్రత్యర్థిని వైట్‌వాష్ చేసిన ఆటగాడిగా రోహిత్ శర్మ నిలిచాడు. అలాగే స్వదేశంలో జట్టుకు అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్‌గా కూడా నిలిచాడు. ఐపీఎల్లో ఐదు సార్లు టైటిల్ గెలిచిన కెప్టెన్‌గా భారీ అంచనాలతో టీమిండియా సారథ్య బాధ్యతలు స్వీకరించాడు రోహిత్ శర్మ. పూర్తి స్థాయి కెప్టెన్‌గా రోహిత్ ఏ క్షణాన బాధ్యతలు తీసుకున్నాడో కానీ, అప్పటి నుంచి అపజయం అనే పదానికి అర్థమే తెలియనట్టు దూసుకుపోతోంది భారత జట్టు.
టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ ముగిసిన తర్వాత న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో 3 మ్యాచుల్లో రెండు హాఫ్ సెంచరీలతో 53 యావరేజ్‌తో 159 పరుగులు చేశాడు రోహిత్ శర్మ. అయితే ఆ తర్వాత సౌతాఫ్రికా టూర్‌కి ముందు గాయపడి, సఫారీలతో వన్డే, టెస్టు సిరీస్‌కి దూరమైన రోహిత్ శర్మ... రీఎంట్రీ తర్వాత చెప్పుకోదగ్గ పర్ఫామెన్స్ ఇవ్వలేకపోతున్నాడు.
విండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో ఓ హాఫ్ సెంచరీ ఆకట్టుకున్నా, ఆ తర్వాత రెండు మ్యాచుల్లో కలిపి 18 పరుగులు మాత్రమే చేయగలిగాడు. మొత్తంగా మూడు మ్యాచుల్లో కలిపి 78 పరుగులే చేశాడు రోహిత్ శర్మ. వెస్టిండీస్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయిన రోహిత్ శర్మ, 3 మ్యాచుల్లో కలిపి 22 యావరేజ్‌తో 66 పరుగులే చేశాడు.
అలాగే ఓపెనర్‌గా కూడా అత్యధిక సార్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమైన ఆటగాడిగా రోహిత్ శర్మ నిలిచాడు. ఓపెనర్‌గా హిట్‌మ్యాన్ 29 సార్లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యాడు. ఈ క్రమంలో ఐర్లాండ్ ఓపెనర్ పాల్ స్టిర్లింగ్ (28)ను రోహిత్ శర్మ అధిగమించాడు. టీ20ల్లో 180+ పరుగుల లక్ష్యఛేదనలో విరాట్ కోహ్లీ 154 స్ట్రైయిక్ రేటుతో 59 యావరేజ్‌తో 533 పరుగులు చేసి టాప్‌లో ఉంటే, రోహిత్ శర్మ 36 యావరేజ్‌తో 372 పరుగులు చేశాడు.
రెండేళ్లుగా ఫామ్‌లో లేకపోయినా విరాట్ కోహ్లీ, కెప్టెన్సీ భారాన్ని మోస్తూనే టీమిండియా తరుపున అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన భారత ప్లేయర్‌గా నిలిచాడు. అలాగే, కెప్టెన్ విరాట్ కోహ్లీ రికార్డులు అద్భుతం అనే చెప్పాలి. కెప్టెన్సీ భారాన్ని మోస్తూ, రన్ మెషిన్లా పరుగులు చేయడం కేవలం కోహ్లీకే సాధ్యం అనే విధంగా అతని రికార్డులు ఉన్నాయ్. కానీ.. రోహిత్ కెప్టెన్సీ భారంతో బ్యాటింగ్ పై దృష్టి పెట్టలేకపోతున్నాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు.