టీమిండియా (Team India)లో ఎన్నో రోజుల నుంచి రోహిత్ శర్మ (Rohit Sharma) - విరాట్ కోహ్లీ (Virat Kohli) గురించి ఒక ప్రచారం హాట్ టాపిక్ గానే ఉంది. భారత క్రికెట్ లో కీలక ఆటగాళ్లు గా కొనసాగుతున్న విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మధ్య అంతర్గత విభేదాలు ఉన్నాయి అంటూ ప్రచారం జరిగింది. అందుకే ఒకరితో ఒకరు కనీసం మాట్లాడడం కూడా లేదని టాక్ కూడా వినిపించింది.
ఇటీవలే విరాట్ కోహ్లీనీ వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించి రోహిత్ శర్మ ను కొత్తగా కెప్టెన్‌గా బాధ్యతలు అప్పగించడంతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరింది. అంతే కాకుండా భారత క్రికెట్ లో విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ మధ్య వివాదం ముదిరి పోవడంతో ఒకరి కెప్టెన్సీలో ఒకరు ఆడటానికి ఆసక్తి చూపడం లేదు అంటూ ప్రచారం జరిగింది.
"ఓ టెస్ట్ టీమ్‌గా ప్రస్తుతం మేం మంచి స్థానంలో ఉన్నాం. ఈ క్రెడిట్ అంతా విరాట్ కోహ్లీదే. కొన్నేళ్లుగా తన సారథ్యంలో జట్టును అద్భుతంగా నడిపించాడు. అతనిలానే నేను జట్టును ముందుకు తీసుకెళ్తాను. డబ్ల్యూటీసీ టోర్నీ టేబుల్లో మేం మధ్యలో ఉన్నాం. టోర్నీలో ముందుకు సాగాలంటే మిగిలిన 9 మ్యాచ్‌ల్లో మేం ప్రతీది గెలవాలి. గత రెండు మూడేళ్లుగా మేం ఎలాంటి తప్పిదాలు చేయలేదు. జట్టు లక్ష్యాలను నేను ఇప్పటికే సెట్ చేశాను.
నేను నా కెరీర్లో 40 మ్యాచ్‌లే ఆడి ఉండవచ్చు. కానీ ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నాను. మరెన్నో విషయాలను నేర్చుకున్నాను. ఇప్పుడు నా చేతిలో గొప్ప బాధ్యత ఉంది. ఇప్పుడు నా దృష్టంతా దానిపైనే ఉంది. ఇక విరాట్ కోహ్లీ కెరీర్లో 100వ మ్యాచ్ ఆడటం గొప్ప విషయం. ఈ ఫార్మాట్లో అతను గొప్పగా రాణించాడు. జట్టులో ఎన్నో మార్పులు తీసుకొచ్చి అద్భుత విజయాలు అందించాడు. అతని 100వ మ్యాచ్‌లో విజయం సాధించి విరాట్‌కు కానుకగా ఇవ్వాలనుకుంటున్నాం.
ఇక 2018 సౌతాఫ్రికా పర్యటనలో విరాట్ కోహ్లీ సాధించిన సెంచరీ నాకు చాలా స్పెషల్. బ్యాటింగ్ ప్రతీకూలమైన పిచ్‌పై విరాట్ అద్భుతంగా ఆడాడు. డేల్ స్టేయిన్, క్రిస్ మోరీస్ వంటి భీకరమైన పేసర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. ఆ ఇన్నింగ్స్ నేను ఇప్పటికీ మరిచిపోలేను. " అంటూ రోహిత్ శర్మ కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపించాడు.