Bigg Boss Abhijeet: అభిజిత్ ఆనందానికి హద్దుల్లేవ్... రోహిత్ శర్మ నుంచి అదిరిపోయే గిఫ్ట్..
Bigg Boss Abhijeet: అభిజిత్ ఆనందానికి హద్దుల్లేవ్... రోహిత్ శర్మ నుంచి అదిరిపోయే గిఫ్ట్..
బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విన్నర్ అయిన అబిజీత్కు టీమిండియా క్రికెటర్ రోహిత్ శర్మ అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్న రోహిత్ శర్మ.. హీరోను ఫోన్లో పలకరించాడు. బిగ్ బాస్ విన్నర్ అయినందుకు అభినందించాడు.

2/ 7
ఈ విషయాన్ని అభిజీత్ సోషల్ మీడియాలో పంచుకున్నాడు. తెలుగు క్రికెటర్ అయిన హనుమ విహారి కూడా ఆస్ట్రేలియాలోనే ఉన్న విషయం తెలిసిందే. రోహిత్ శర్మకు కూడా తెలుగు వచ్చు. ఇద్దరు తెలుగు వారు కావడంతో బిగ్ బాస్ చర్చ కూడా వచ్చింది. ఈ సందర్భంగా హనుమవిహారి బిగ్ బాస్ విన్నర్ అభిజిత్ గురించి చెప్పాడు.
3/ 7
బిగ్ బాస్ విన్నర్‌గా నిలిచిన అభిజిత్‌ను అభినందిస్తూ రోహిత్ శర్మ తన జెర్సీని గిఫ్ట్ ఇచ్చాడు. రోహిత్ శర్మ జెర్సీ నెంబర్ 45. దానిపై విత్ లవ్, బెస్ట్ విషెస్... రోహిత్ శర్మ అంటూ సంతకం చేసి మరీ ఇచ్చాడు.
4/ 7
రోహిత్ శర్మ అంటే పిచ్చెక్కిపోయే తనకు తన ఫేవరెట్ క్రికెటర్ నుంచి గిఫ్ట్ రావడంతో అభిజిత్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. తనకు హెల్ప్ చేసిన హనుమవిహారికి అభిజిత్ థాంక్స్ చెప్పాడు.
5/ 7
చిన్నప్పుడు తాను క్రికెటర్ అవ్వాలనుకున్నానని ఈ సందర్భంగా అభిజిత్ మరో విషయాన్ని కూడా బయటపెట్టాడు. కానీ, విధి తనను సినిమాల వైపు నడిపించిందని చెప్పారు.
6/ 7
ఇప్పుడు క్రికెటర్ నుంచి గిఫ్ట్ అందుకోవడంతో తన ఫ్యాన్ బాయ్ మూమెంట్ అని అభిజిత్ ఆనందంలో తేలిపోతున్నాడు.
7/ 7
ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్న టీమిండియాకు విజయం వరించాలని, అందరూ సపోర్టు చేయాలని పిలుపునిచ్చాడు అభిజిత్. (Abijeet/Twitter)