గావస్కర్ కామెంట్స్ చేసి 24 గంటలు గడిచాయో లేదో.. రోహిత్ శర్మ తన బ్యాట్ తో అతడికి ఘాటుగా సమాధానం చెప్పాడు. ఇంగ్లండ్ తో జరిగిన తొలి వన్డేలో రోహిత్ శర్మ (58 బంతుల్లో 76 నాటౌట్; 7 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు అర్ధ సెంచరీతో చెలరేగిపోయాడు. ఫలితంగా భారత్ 10 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ పై ఘనవిజయం సాధించింది.