* ఓపెనర్ల ప్రదర్శన అంతంతే.. : టీ-20 ప్రపంచ కప్‌లో భారత్ ఓపెనింగ్ జోడి దారుణంగా విఫలమైంది. ముఖ్యంగా పవర్ ప్లేలో వారి ప్రదర్శన స్థాయికి తగ్గట్టు లేదు. కేఎల్ రాహుల్ ఆరు మ్యాచ్‌ల్లో 128 పరుగులు చేయగా, రోహిత్ శర్మ 116 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో ఈ ప్రభావం టీమ్‌పై తీవ్రంగా పడిందని దినేష్ లాడ్ చెప్పుకొచ్చారు.
* ధావన్ అలా... రాహుల్ ఇలా.. : రోహిత్, శిఖర్ ధావన్‌ల ఓపెనింగ్ కాంబినేషన్‌తో పోలిస్తే రాహుల్-రోహిత్ జోడి స్కోరింగ్ పరంగా చాలా బలహీనంగా ఉందని దినేష్ లాడ్ ఎత్తి చూపారు. పవర్ ప్లేలో రోహిత్ వికెట్ కాపాడుకోవడానికి ప్రయత్నిస్తే.. శిఖర్ దావన్ గతంలో హిట్టింగ్ చేసేవాడని, అయితే వరల్డ్‌కప్‌లో కేఎల్ రాహుల్ అలా చేయలేకపోయాడని దీంతో ప్లవర్ ప్లేలో స్కోర్ బోర్డ్ పరుగులు పెట్టలేదని అభిప్రాయపడ్డారు.
* పరుగులు చేయలేక ఒత్తిడికి గురై.. : ఇప్పటివరకు ఏడు వరల్డ్ కప్‌ల్లో ఆడిన హిట్‌మ్యాన్.. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి తన సహజ దూకుడైన ఆటతీరును కనబర్చలేదు. ఈసారి జట్టు కెప్టెన్‌గా బరిలోకి తిగడంతో ఒత్తిడికి గురయ్యాడు. ప్రారంభ ఓవర్లలో పరుగులు చేయలేక ఒత్తిడికి గురైన రోహిత్, తరువాత ప్రతిసారి బంతిని హిట్ చేయడానికి ప్రయత్నించి వికెట్ సమర్పించుకున్నాడని.. దాదాపు ప్రతి మ్యాచ్‌లో ఇలానే జరిగిందని దినేష్ పేర్కొన్నారు.
* ఫామ్‌లో లేక.. పైగా హెర్నియా శస్ట్రచికిత్స..: కేఎల్ రాహుల్ ఈ ఏడాది అసలు ఫామ్‌లోనే లేడు. పైగా స్పోర్ట్స్ హెర్నియా శస్త్రచికిత్స చేయించుకున్నాడు. వరల్డ్ కప్‌లో ఓపెనర్‌గా పరుగులు చేయడానికి రాహుల్ చాలా ఇబ్బందులు పడ్డాడు. దీంతో రోహిత్‌పై భారం పడిండి. ఫలితంగా పరుగులు రాకపోవడంతో అతడు ఒత్తిడికి గురై హిట్టింగ్‌కు ప్రయత్నించి వికెట్లు పారేసుకున్నారని దినేష్ విశ్లేషించారు.
* రోహిత్ ఫిట్‌నెస్‌పై.. : రోహిత్ ఫిట్‌నెస్‌పై వస్తున్న విమర్శలపై దినేష్ స్పందించారు. గత రెండేళ్ల నుంచి రోహిత్ బాగా ఆడుతున్నాడని, అతని ఫిట్నెస్ వస్తున్న విమర్శలను కొట్టిపారేశారు. భవిష్యత్‌లో టీమ్ కెప్టెన్‌గా రోహిత్ కొనసాగిన అది మంచి విషయమే అన్నారు. రోహిత్ 51 టీ-20 మ్యాచ్‌లకు నాయకత్వం వహించి, 39 సార్లు గెలిపించాడు. తన కెప్టెన్సీలో ఇండియా 13 ద్వైపాక్షిక సిరీస్‌లు గెలిచింది. ఇలా రోహిత్ కెప్టెన్సీ ట్రాక్ రికార్డ్‌ను గుర్తుచేశారు అతని చిన్ననాటి కోచ్ దినేష్.