2007 టి20 ప్రపంచ కప్ ద్వారా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ (Rohit Sharma) తన టీమిండియా (Team India) ప్రస్థానాన్ని మొదలు పెట్టారు. అయితే టీమిండియాకు వచ్చిన తొలి నాళ్లలో రోహిత్ శర్మ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. ఫిట్ నెస్ సమస్యలు, నిర్లక్ష్యపు షాట్లతో జట్టులోకి వస్తూ పోతూ ఉండేవాడు. అయితే ఓపెనర్ గా ఎప్పుడైతే ప్రమోట్ అయ్యాడో.. అక్కడి నుంచి రోహిత్ వెనుదిరిగి చూసుకోలేదు.
మూడు డబుల్ సెంచరీలు : వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు చేసిన ఏకైక ప్లేయర్ గా రోహిత్ శర్మ ఉన్నాడు. 2013లో ఆస్ట్రేలియాపై రోహిత్ తన తొలి డబుల్ సెంచరీని నమోదు చేశాడు. కేవలం 158 బంతుల్లోనే అతడు 16 సిక్సర్లు ,12 ఫోర్లతో ఈ ఘనతను అందుకున్నాడు. ఇక 214, 2017లలో శ్రీలంకపై రెండు సార్లు ద్విశతకాన్ని బాదాడు. (PC : BCCI)
వ్యక్తిగ స్కోరులో అత్యధిక పరుగులను బౌండరీల నుంచే సాధించిన ప్లేయర్ గా రోహిత్ శర్మ ఉన్నాడు. 2014లో శ్రీలంకపై బాదిన రెండో డబుల్ సెంచరీలో రోహిత్ ఏకంగా 186 పరుగులను బౌండరీల ద్వారానే రాబట్టడం విశేషం. మొత్తం 264 పరుగులు చేస్తే అందులో 186 పరుగులు బౌండరీల రూపంలోను వచ్చాయి. ఇందులో 33 ఫోర్లు, 9 సిక్సర్లు ఉన్నాయి.