విరాట్ కోహ్లీ (Virat Kohli).. రికార్డుల రారాజుగా కితాబు అందుకున్నాడు. కొండంత లక్ష్యం ముందున్నా.. ప్రత్యర్థి బౌలర్లు సవాల్ విసురుతున్నా.. విరాట్ కోహ్లీ ఇసుమంత ఒత్తిడికి గురైన దాఖలాలు లేవు. కోహ్లీ మాటల్లో చెప్పాలంటే.. అతనికి సవాళ్లంటే ఇష్టం. కానీ.. ఇదంతా ఒకప్పుడు. 2019 నుంచి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇప్పుడున్న కోహ్లీ ఫామ్ లేకుండా నానా తంటాలు పడుతున్నారు.
అయితే, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma), స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) మాత్రం ఆ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. విజ్డన్ టాప్ 5 క్రికెటర్స్ జాబితాలో ఈ ఇద్దరు భారత ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు. గతేడాది అద్భుత ప్రదర్శన కనబర్చిన ప్లేయర్స్ నుంచి విజ్డన్ దినపత్రిక టాప్ 5 అత్యుత్తమ ఆటగాళ్లతో పాటు లీడింగ్ క్రికెటర్‌ను సెలెక్ట్ చేసింది. ఈ వివరాలను విజ్డన్ ఎడిటర్ లారెన్స్ బ్రూత్ వెల్లడించారు.
గతేడాది వేసవిలో ఇంగ్లాండ్ పర్యటన సందర్భంగా బుమ్రా అదిరిపోయే ప్రదర్శన చేశాడు. లుగు టెస్ట్‌ల్లో బుమ్రా 18 వికెట్లతో సత్తా చాటాడు. బ్యాటింగ్లనూ సత్తా చాటాడు. టెయిలండర్‌గా కీలక పరుగులు చేశాడు. లార్డ్స్, ఓవల్ మైదానాల్లో మ్యాచ్ విన్నర్‌గా నిలిచాడు. దీంతో భారత్‌కు 2-1 ఆధిక్యం లభించగా, కరోనా కారణంగా వాయిదా పడిన ఒక టెస్టు మ్యాచ్‌ను ఈ ఏడాది జులైలో నిర్వహించనున్నారు.