న్యూజిలాండ్ సిరీస్‌లో విరాట్ అండ్ రోహిత్ గ్యాంగ్‌తో పాటు మిథాలీ అండ్ హార్మన్‌ప్రీత్ గ్యాంగ్ కూడా అదరగొట్టారు. సీనియర్ మోస్ట్ కెప్టెన్ మిథాలీరాజ్ సారథ్యంలో ఆడిన వన్డే సిరీస్‌ను 2-1తో సొంతం చేసుకున్న మహిళల జట్టు... హార్మన్ ప్రీత్ కెప్టెన్సీలో ఆడిన టీ20 సిరీస్‌లో మాత్రం ఒక్క విజయం కూడా నమోదుచేయలేకపోయింది. 3-0తో సిరీస్ కోల్పోయినప్పటికీ సిరీస్ మొత్తం ఇద్దరూ అమ్మాయిలు మాత్రం చెలరేగి ఆడారు. వాళ్లే స్టార్ ఓపెనర్ స్మృతి మంధానా... యంగ్ సెన్సేషనల్ జెమీమా రోడ్రిగ్స్. కివీస్ టూర్లో ఈ ఇద్దరూ చేసిన పరుగుల కారణంగా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో కెరీర్ బెస్ట్ చేరుకున్నారు.