ఇంకో మాట కూడా అన్నాడు. తనను ఇప్పుడు టీమిండియాకు సెలెక్ట్ చేస్తే పెద్దగా సంతోషించనంటూ ఓవర్ గా మాట్లాడాడు. ఈ సీజన్ లో పరాగ్ కంటే కూడా అద్భుతంగా రాణించిన రాహుల్ త్రిపాఠి, శిఖర్ ధావన్ లాంటి వాళ్లే టీమిండియాలో ప్లేస్ కోసం పడిగాపులు కాస్తున్నారనే విషయాన్ని పరాగ్ గుర్తుంచుకుంటే మంచిది. ఇలాంటి మాటలు కాకుండా ఆటపై శ్రద్ధ పెడితే పరాగ్ కు మంచిది. లేదంటే రాజస్తాన్ టీం వదిలించుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు.