భారతదేశంలో క్రేజ్ ఉన్న మతాలు రెండే. అందులో ఒకటి క్రికెట్, మరొకటి సినిమా. ఇక, క్రికెట్ కున్న పాపులారిటీ గురించి ఎంత చెప్పినా తక్కువే. సినిమా హీరోల కన్నా.. టీమిండియా క్రికెటర్లకే క్రేజ్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. అలాంటి క్రికెట్, సినిమా కలిసిపోతే..ఆలోచన ఎలా ఉంది. అవును..క్రికెటర్లకు, హీరోయిన్లకు పెళ్లిళ్లు చాలానే జరిగాయ్. ఎందరో క్రికెటర్లు బాలీవుడ్ హీరోయిన్లతో చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. ఇక, క్రికెటర్ శ్రీశాంత్ జీవితం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినా పని లేదు. మనోడి ఎంతో మంది హీరోయిన్లతో ప్రేమాయణం సాగించాడు.
శ్రీశాంత్ జీవితంలో... స్పాట్ ఫిక్సింగ్ వివాదం కారణంగా ఏడేళ్ల పాటు క్రికెట్‌కు దూరమైన శ్రీశాంత్, సినిమాలు, రాజకీయాలు, టీవీ షోలు... ఇలా అన్ని రంగాల్లోనూ ప్రయత్నాలు చేశాడు. దూకుడైన వ్యక్తిత్వం కలిగిన శ్రీశాంత్, 37 ఏళ్ల వయసులో క్రికెట్లోకి కమ్‌బ్యాక్ ఇచ్చి అందర్నీ ఆశ్చర్యపోయేలా చేశాడు. ఐపీఎల్ మినీ వేలంలో చోటు దక్కించుకోలేకపోయినా మళ్లీ ప్రయత్నిస్తూనే ఉంటానని ప్రకటించిన శ్రీశాంత్ డేటింగ్ చేసిన హీరోయిన్ల లిస్ట్ పై ఓ లుక్కేద్దాం.
అయితే ఏడాది పాటు డేటింగ్ చేసిన రియాసేన్, శ్రీశాంత్... ఆ తర్వాత ఎవరి దారి వారు చూసుకున్నారు. " నేను శ్రీశాంత్‌తో డేటింగ్ చేయడం లేదు. కేవలం కొచ్చి ఆడిన మూడు మ్యాచులకు మాత్రమే హాజరయ్యాను. అది వర్క్ విషయంలో మాత్రమే, మిగిలింది కేవలం మీ ఊహాగానాలే" అంటూ కొట్టిపారేసింది రియా సేన్. ఈ భామకి సినిమా అవకాశాలు దక్కకపోయినా.. అందాల ఆరబోత లో ముందుంటుంది.
లక్ష్మీ రాయ్ : క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీతో కొన్నాళ్లు పాటు డేటింగ్ చేసివార్తల్లో నిలిచిన కోలీవుడ్ హీరోయిన్ లక్ష్మీ రాయ్, శ్రీశాంత్‌తో కూడా ప్రేమాయణం నడిపించిందని టాక్. రాయ్ లక్ష్మీ, శ్రీశాంత్ కలిసి క్లోజ్‌గా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయ్యాయి. అయితే ఆమెను కేవలం సెట్స్‌లో మాత్రమే కలిశానని చెప్పిన శ్రీశాంత్, ఆమెతో ఎలాంటి సంబంధం లేదని చెప్పాడు.
షాజన్ పదంశ్రీ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఆరెంజ్ మూవీలో నటించింది షాజన్ పదంశ్రీ. బాలీవుడ్లో కొన్ని సినిమాల్లో నటించిన ఈ అమ్మడు కూడా శ్రీశాంత్‌తో కొన్నాళ్లు డేటింగ్ చేసింది. శ్రీశాంత్‌ను " స్వీట్" అంటూ ముద్దుగా పిలిచిన షాజన్, అతనితో కలిసి లాండ్ డ్రైవ్‌లకు కూడా వెళ్లినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఆ తర్వాత మేం స్నేహితులమంటూ రూమర్లను కొట్టి పారేసింది.
శ్రీశాంత్, శ్రియా శరణ్ కలిసి ఓ ప్రొడక్ట్‌కి బ్రాండ్ అంబాసిడర్స్‌గా చేశారు. ఆ సమయంలో ఈ ఇద్దరూ కలిసి ముంబైలో ఫ్యాషన్ షో కూడా చేశారు. ఆ తర్వాత కొన్ని పార్టీల్లో కూడా శ్రియా శరణ్, శ్రీశాంత్ కలిసి తిరుగుతున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే శ్రీశాంత్‌తో డేటింగ్ చేస్తున్నట్టు వచ్చిన వార్తలను శ్రియా కొట్టి పారేసింది. శ్రీశాంత్‌తో తాను కలిసి మాట్లాడింది కేవలం ఐదు నిమిషాలేనంటూ తేల్చేసింది శ్రియా.
సుర్వీన్ చావ్లా : " ఏక్ ఖిలాడీ ఏక్ హసీనా " డ్యాన్స్ షోలో సుర్వీన్ చావ్లాతో కలిసి పాల్గొన్నాడు శ్రీశాంత్. ఈ సమయంలో ఈ ఇద్దరి సమయంలో ఏర్పడిన అనుబంధం ప్రేమగా మారింది. అయితే స్పాట్ ఫిక్సింగ్ వివాదంలో శ్రీశాంత్ ఇరుక్కోవడంతో ఈ ఇద్దరి అనుబంధానికి తెరపడింది. డ్యాన్స్ షో నుంచి టీవీ ప్రోగ్రామ్‌ల్లోకి, అటు నుంచి సినిమాల్లోకి వెళ్లింది సుర్వీన్ చావ్లా.