RISHABH PANT PLACE IN TEAM INDIA IN DANGER DUE TO SRIKAR BHARAT BRILLIANT BATTING AGAINST LEICESTERSHIRE SJN
Rishabh Pant : పంత్ కు పక్కలో బల్లెంలా మారిన వైజాగ్ కుర్రాడు.. ఇంతకీ ఏం జరిగిందంటే?
Rishabh Pant : లిమిటెడ్ ఓవర్ల క్రికెట్ లో పంత్ కు ప్రత్యామ్నాయంగా కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, దినేశ్ కార్తీక్ లు తయారు కాగా.. తాజాగా టెస్టుల్లో కూడా ఒక ప్లేయర్ తయారయ్యాడు.
టీమిండియా (Team India)లో ప్రస్తుతం రిషభ్ పంత్ (Rishabh Pant) పరిస్థితి అంతగా ఏం బాగాలేదు. సౌతాఫ్రికాతో జరిగిన టి20 సిరీస్ లో అటు బ్యాటర్ గా ఇటు కెప్టెన్ గా రిషభ్ పంత్ దారుణంగా విఫలమైన సంగతి తెలిసిందే.
2/ 6
లిమిటెడ్ ఓవర్ల క్రికెట్ లో పంత్ కు ప్రత్యామ్నాయంగా కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, దినేశ్ కార్తీక్ లు తయారు కాగా.. తాజాగా టెస్టుల్లో కూడా ఒక ప్లేయర్ తయారయ్యాడు.
3/ 6
ప్రస్తుతం టీమిండియా ఇంగ్లండ్ పర్యటనలో ఉంది. రీషెడ్యూల్ టెస్టుకు ముందు లీసెస్టర్ షైర్ తో నాలుగు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ను ఆడుతోంది. ఈ మ్యాచ్ లో బరిలోకి దిగిన తెలుగు కుర్రాడు శ్రీకర్ భరత్.. తొలి ఇన్నింగ్స్ లో 70 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇక రెండో ఇన్నింగ్స్ లో 43 పరుగులు చేసి సత్తా చాటాడు.
4/ 6
దాంతో పంత్ కు పక్కలో బల్లెంలా తయారయ్యాడు. పంత్ రాణించకపోతే అతడి స్థానంలో భరత్ ను తీసుకునేందుకు బీసీసీఐ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా భరత్ ను ఓపెనర్ గా కూడా రోహిత్ పరీక్షించాడు.
5/ 6
ఈ వార్మప్ మ్యాచ్ లో పంత్ 76 పరుగులు చేయడం విశేషం. అయితే ఇదే ఫామ్ ను అతడు ఇకపై కొనసాగించాల్సి ఉంటుంది. లేదంటే అతడికి ప్రత్యామ్నాయంగా శ్రీకర్ భరత్ బరిలోకి దిగే అవకాశం ఉంది.
6/ 6
వార్మప్ మ్యాచ్ లో భారత్ తమ రెండో ఇన్నింగ్స్ లో 6 వికెట్లకు 203 పరుగులు చేసింది. ఫలితంగా 205 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఆటకు రేపు చివరి రోజు.