రిషభ్ పంత్ కుడి కాలు తీవ్రంగా గాయపడ్డట్లు ఆ వెబ్ సైట్ తన కథనంలో పేర్కొంది. మోకాలితో పాటు చీలిమండ కూడా విరిగినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా మోకాలికి సంబంధించిన మూడు లెగిమెంట్స్ (యాంటీరియర్, పోస్టీరియర్, ఎంసీఎల్) చిరిగిపోయినట్లు క్రిక్ ఇన్ఫో తన కథనంలో పేర్కొంది.