* రిషబ్ పంత్ : భారత క్రికెట్లో అతి తక్కువ కాలంలోనే గుర్తింపు తెచ్చుకున్న ఆటగాడు రిషబ్ పంత్. ఫార్మాట్ ఏదైనా దూకుడుగా ఆడడం పంత్ సహజ లక్షణం. 2018లో ఇంగ్లండ్‌పై టెస్ట్‌ల్లో అరంగ్రేటం చేశాడు. దూకుడుగా ఆడుతూ ఒంటి చేతితో జట్టుకు విజయానందించిన సందర్భాలు ఉన్నాయి. ఆసీస్ గడ్డపై భారత్ టెస్ట్ సిరీస్ కైవసం చేసుకోవడంలో పంత్ కీలక పాత్ర పోషించాడు. ఇక వన్డేల్లోనూ అద్భుతంగా రాణిస్తున్నాడు.
కీలక సమయాల్లో మంచి ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయాలను అందిస్తున్నాడు. అయితే పొట్టి ఫార్మాట్లో ఇప్పటి వరకు రాణించిన సందర్భాలు చాలా తక్కువ. టీ20ల్లో ఎక్కువ అవకాశాలు వచ్చినా, సద్వినియోగం చేసుకోలేకపోయాడు. పంత్ ఇప్పటి వరకు 66 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. స్ట్రైక్ రేట్ 126.54, యావరేజ్ కేవలం 22.43గా ఉంది. ఈ గణాంకాలు చూస్తే టీ20ల్లో పంత్ తన స్థాయికి తగ్గట్టు ప్రదర్శన చేయలేదని అర్థమవుతుంది.
* శుభ్‌మన్ గిల్ : ఇండియన్ క్రికెట్లో శుభ్‌మన్ గిల్ పేరు మారుమోగుతోంది. వన్డే ఫార్మాట్లో ఆకాశమే హద్దుగా చెలరేగి పోతున్నాడు. సెంచరీల మీద సెంచరీలు చేస్తున్నాడు. 2019లో వన్డేలో అరంగ్రేటం చేసిన గిల్ ఇప్పటి వరకు 21 మ్యాచ్‌లు ఆడాడు. 73.76 సగటుతో 1254 పరుగులు చేశాడు. వన్డేలో అతని స్ట్రైక్ రేట్ 109.81గా ఉంది. ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో మొదటి మ్యాచ్‌లో గిల్ డబుల్ సెంచరీ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. అయితే గిల్‌కు టీ-20 ఫార్మాట్ అంతగా కలిసి రావడం లేదు.
ఇటీవల శ్రీలంకతో జరిగిన టీ-20 సిరీస్‌కు తొలిసారిగా గిల్ ఎంపికయ్యాడు. మూడు మ్యాచ్‌ల్లో ఆకట్టుకోలేకపోయాడు. ప్రస్తుతం కివీస్‌తో జరుగుతున్న టీ-20 సిరీస్ లోనూ గిల్ మెరుగైన ప్రదర్శన చేయలేదు. చివరి మ్యాచ్‌లోనైనా రాణిస్తాడా లేదా అన్నది చూడాల్సి ఉంది. టీ-20 ఫార్మాట్లో గిల్ ఇప్పటి వరకు 5 మ్యాచ్‌లు ఆడి, 15.20 సగటుతో కేవలం 76 పరుగులే చేశాడు. దీంతో టీ-20ల్లో గిల్ స్థానంలో పృథ్వీ షాను ఎంపిక చేయాలని మాజీలు డిమాండ్ చేస్తున్నారు.
ఇక.. వచ్చే ఏడాది అమెరికా, విండీస్ వేదికగా టీ20 వరల్డ్ కప్ 2024 జరగనుంది. హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని టీమిండియా ఈ మెగాటోర్నీలో బరిలోకి దిగే అవకాశం ఉంది. వన్డేల్లో సత్తా చాటుతూ.. టీ20ల్లో విఫలమవుతున్న ఈ ముగ్గురి ఆటగాళ్లను నమ్ముకుంటే హార్దిక్ పని ఫసక్కే అని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. రోహిత్, కోహ్లీ లాంటి అనుభవమున్న ఆటగాళ్లలో ఒక్కరైనా సరే తుది జట్టులో ఉండాలని క్రీడా పండితులు అభిప్రాయపడుతున్నారు.