Rishabh Pant : అదే జరిగితే ధోని, కోహ్లీలకు సాధ్యం కానిది పంత్ సాధించినట్లే.. మరి సాధించగలడా?
Rishabh Pant : అదే జరిగితే ధోని, కోహ్లీలకు సాధ్యం కానిది పంత్ సాధించినట్లే.. మరి సాధించగలడా?
IND vs SA : ఈ క్రమంలో టీమిండియా (Team India) కెప్టెన్ గా వ్యవహరిస్తోన్న రిషభ్ పంత్ (Rishabh Pant)ను ఒక ఘనత ఊరిస్తోంది. సక్సెస్ ఫుల్ కెప్టెన్లుగా అనిపించుకున్న మహేంద్ర సింగ్ ధోని (Ms Dhoni), విరాట్ కోహ్లీ (Virat Kohli)లకు కూడా ఈ ఘనత ఇప్పటి వరకు దక్కలేదు.
సౌతాఫ్రికా (South Africa)తో ఐదు మ్యాచ్ ల టి20 సిరీస్ ఆఖరి అంకానికి చేరుకుంది. మరికాసేపట్లో సిరీస్ విజేతను తేల్చే ఐదో టి20 బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది.
2/ 6
ఈ క్రమంలో టీమిండియా (Team India) కెప్టెన్ గా వ్యవహరిస్తోన్న రిషభ్ పంత్ (Rishabh Pant)ను ఒక ఘనత ఊరిస్తోంది. సక్సెస్ ఫుల్ కెప్టెన్లుగా అనిపించుకున్న మహేంద్ర సింగ్ ధోని (Ms Dhoni), విరాట్ కోహ్లీ (Virat Kohli)లకు కూడా ఈ ఘనత ఇప్పటి వరకు దక్కలేదు.
3/ 6
భారత్ వేదికగా ఒకటి కంటే ఎక్కువ మ్యాచ్ లతో జరిగిన టి20 సిరీస్ ను భారత్ ఇప్పటి వరకు సొంతం చేసుకోలేదు. ధోని, విరాట్ కోహ్లీ లాంటి వారు టీమిండియాను నడిపించినా కూడా సౌతాఫ్రికాపై సొంత గడ్డ మీద భారత్ టి20 సిరీస్ ను సొంతం చేసుకోలేకపోయింది.
4/ 6
2015లో భారత్ వేదికగా సౌతాఫ్రికాతో మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ జరిగింది. అప్పుడు భారత కెప్టెన్ గా ధోని ఉన్నాడు. ఆ సిరీస్ ను భారత్ 0-2తో కోల్పోయింది.
5/ 6
ఇక 2019లో ఇరు జట్ల మధ్య భారత్ వేదికగా మరోసారి మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ జరిగింది. అప్పుడు భారత్ కు విరాట్ కోహ్లీ సారథిగా ఉన్నాడు. అయితే రెండు మ్యాచ్ ల తర్వాత ఇరు జట్లు కూడా 1-1తో సమంగా నిలిచాయి. అయితే కోల్ కతా వేదికగా జరగాల్సిన చివరి టి20 వర్షంతో రద్దైంది. దాంతో సిరీస్ డ్రాగా నిలిచింది.
6/ 6
అయితే సౌతాఫ్రికాపై టి20 సిరీస్ నెగ్గే చాన్స్ మరోసారి భారత్ కు లభించింది. నేటి మ్యాచ్ లో భారత్ విజయం సాధిస్తే ఐదు మ్యాచ్ ల సిరీస్ ను భారత్ 3-2తో సొంతం చేసుకునే అవకాశం ఉంది. అదే జరిగితే ధోని, కోహ్లీలకు సాధ్యం కాని ఘనతను పంత్ సాధించినట్లు అవుతుంది.