టీమిండియా హెడ్ కోచ్ గా రాహుల్ ద్రావిడ్ (Rahul Dravid) బాధ్యతలు స్వీకరించారు. అతని పర్యవేక్షణలో న్యూజిలాండ్ పై మొదటి మ్యాచ్‌లో కూడా విక్టరీ కొట్టింది భారత్. రవిశాస్త్రి పదవీకాలం ముగిసిన తర్వాత ద్రవిడ్‌ని నియమించిన సంగతి తెలిసిందే. అయితే దీనికంటే ముందే టీమిండియా కోచ్ ఆఫర్ ఆస్ట్రేలియా లెజెండ్ రికీ పాంటింగ్ (Ricky Ponting)కి వచ్చింది. అయితే దీనిని పాంటింగ్ తిరస్కరించారు.
" తనను టీమ్ ఇండియా కోచ్‌గా చేయాలని బీసీసీఐ కోరిందని అయితే తాను దానిని తిరస్కరించాల్సి వచ్చిందని, దీనికి ప్రధాన కారణం సమయాభావ" అని పాంటింగ్ చెప్పారు. టీమిండియా కోచ్ గా ఉండటం మాములు విషయం కాదని.. 300 రోజులు కుటుంబానికి దూరంగా ఉండటం తనకు ఇష్టం లేదని పాంటింగ్ అన్నారు. అతను ఏ జాతీయ జట్టుకు కోచ్‌గా ఉండకపోవడానికి ఇదే కారణం.
ఇక, రాహుల్ ద్రావిడ్ పర్యవేక్షణలో రాబోయే రెండేళ్ల పాటు టీమ్ ఇండియా కొత్త శిఖరాలను తాకడానికి ప్రయత్నిస్తుంది. ఈ రెండేళ్ల కాలంలో టీ-20 వరల్డ్ కప్, వన్డే వరల్డ్ కప్, టెస్ట్ ఛాంపిన్షిప్ టోర్నీలు జరగనున్నాయ్. ఈ మెగాటోర్నీల్లో టీమిండియా విజేతగా నిలబెడతాడని రాహుల్ ద్రావిడ్ పై నమ్మకముంచారు టీమిండియా ఫ్యాన్స్.