ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ ఉన్నారు. 2019 అక్టోబర్ 23న ఆయన ఈ పదవిని చేపట్టారు. బీసీసీఐ అధ్యక్షుడితో పాటు కార్యవర్గం కాల పరిమితి 3 ఏళ్లు. ఈ ఏడాది అక్టోబర్ తో గంగూలీ కార్యవర్గం పదవీ కాలం ముగుస్తుంది. ఈ క్రమంలో బీసీసీఐ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం కోసం ఎలక్షన్స్ నోటిఫికేషన్ ఇప్పటికే విడుదలైంది.
అక్టోబర్ 18న ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజున ఫలితాలను వెల్లడిస్తారు. ఇక బరిలో ఉన్న అభ్యర్థులు ఈ నెల 14లోపు తమ నామినేషన్లను దాఖలు చేయాల్సి ఉంది. లోధా కమిటీ సిఫార్సు ప్రకారం వరుసగా రెండు పర్యయాలు బీసీసీఐలోని ఏ పదవిలోనూ ఉండేందుకు వీలు లేదు. అయితే ఇటీవలె సుప్రీం కోర్టుకు వెళ్లిన బీసీసీఐ దీని విషయంలో అనుకూల తీర్పును తెచ్చుకుంది.