[caption id="attachment_1596990" align="alignnone" width="900"] కుర్రాళ్ల దెబ్బకు టీమిండియా సీనియర్ బ్యాటర్ శిఖర్ ధావన్ కెరీర్‌కు ఎండ్‌కార్డు పడినట్లే కనిపిస్తోంది. తాను ఎలాగైతే ఓపెనర్‌గా దూసుకొచ్చి గంభీర్ కెరీర్‌ను ప్రమాదంలో పడేశాడో.. ఇప్పుడు అదే పని చేస్తున్నారు టీమిండియా యంగ్ గన్స్. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం కాకుండా ఏకంగా ధావన్ కెరీర్‌కు ఎసరు పెట్టేశారు.
[caption id="attachment_1596996" align="alignnone" width="828"] ఓపెనర్‌గా కెప్టెన్ రోహిత్ ఎలాగో ఉన్నాడు. ఇక గత వరల్డ్‌కప్‌ల్లో తనతో కలిసి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన ధావన్ కెరీరే లాస్ట్ స్టేజ్‌కు చేరుకున్నట్లు కనిపిస్తోంది. టీమిండియా యువ సంచలనం శుభ్ మన్ గిల్, మరో యంగ్ గన్ ఇషాన్ కిషన్ ప్రస్తుత ఫామ్ చూస్తుంటే ఇక ధావన్ టీమిండియా జెర్సీలో చూడడం కష్ఠమే అనిపిస్తోంది.
[caption id="attachment_1597000" align="alignnone" width="900"] ఇటు శుభ్ మన్ గిల్ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండియాగా మారిపోయాడు. ఇటివల ముగిసిన న్యూజిలాండ్ సిరీస్‌తో ఓపెనింగ్ స్లాట్‌పై కర్చీఫ్ వేశాడు గిల్. ఉప్పల్ స్టేడియంలో గత వారం జరిగిన మ్యాచ్‌లో ఉప్పెనలా విరుచుకుపడ్డాడు. 145 బంతుల్లో డబుల్ సెంచరీ చేసి రికార్లు సృష్టించాడు. అతిచిన్న వయసులోనే డబుల్ సెంచరీ చేసిన తొలి బ్యాటర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.