గతేడాది సెప్టెంబర్‌లో జడేజా మోకాలికి గాయమైంది. సర్జరీ చేయించుకున్న జడేజా ఎన్సీఏ రిహాలిటేషన్లో గడిపాడు. గాయం కారణంగా టీ20 వరల్డ్‌కప్‌తో పాటు ఆసియాకప్కూ దూరమయ్యాడు. ఇక జడేజా రాకతో టీమిండియాకు అదనపు బలం చేకురినట్లైంది. భారత్‌లో ఉండే స్పిన్ పిచ్‌లపై జడేజా ఎంత ప్రమాదకరమైన బౌలరో ప్రత్యర్థి జట్లకు తెలుసు.
జడేజా కమ్‌బ్యాక్ వార్త విన్న అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. 2019 వరల్డ్ కప్ తర్వాత జడ్డూ తనను తాను చాలా మార్చుకున్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో సరైన ఫినిషర్‌గా రాణిస్తూనే.. టెస్టుల్లో కీలకమైన బ్యాటర్‌గా మారాడు. ప్రపంచ నెంబర్ వన్ ఆల్‌రౌండర్‌గా తనను తాను మలుచుకున్నాడు. అలాంటి సమయంలో గాయాల కారణంగా జట్టుకు దూరం అవ్వాల్సి వచ్చింది.
అటు టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ తొలి టెస్టుకు దూరమయ్యాడు. వెన్నునొప్పి గాయంతో బాధపడుతున్న అయ్యర్ ఇంకా పూర్తిగా కోలుకోలేదని.. అందుకే తొలి టెస్టుకు అతను దూరమైనట్లు బీసీసీఐ ప్రకటించింది. శ్రేయాస్ అయ్యర్ స్థానంలో సూర్యకుమార్ యాదవ్ టెస్టు అరంగేట్రం చేసే అవకావం కనిపిస్తుంది.