IND vs BAN 1st Test : కపిల్ దేవ్ సరసన చోటు దక్కించుకున్న అశ్విన్.. భారత్ నుంచి కేవలం ఇద్దరు మాత్రమే
IND vs BAN 1st Test : కపిల్ దేవ్ సరసన చోటు దక్కించుకున్న అశ్విన్.. భారత్ నుంచి కేవలం ఇద్దరు మాత్రమే
IND vs BAN 1st Test : దాంతో తొలి టెస్టు తర్వాత అశ్విన్ కెరీర్ పై అనేక సందేహాలు వచ్చాయి. అతడిని జట్టు నుంచి తప్పించాలంటూ చాలా మంది అభిప్రాయపడ్డారు. ఇక రెండో టెస్టు కోసం ప్రకటించిన జట్టులో కుల్దీప్ ను తప్పించి.. అశ్విన్ ను ఉంచడంపై కూడా విమర్శలు వచ్చాయి.
బంగ్లాదేశ్ (Bangladesh)తో జరిగిన తొలి టెస్టులో టీమిండియా (Team India) వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) బౌలర్ గా విఫలం అయ్యాడు. బ్యాటింగ్ లో అర్ధ సెంచరీ చేసినా బౌలర్ గా మాత్రం కేవలం ఒక్క వికెట్ ను మాత్రమే దక్కించుకున్నాడు.
2/ 8
దాంతో తొలి టెస్టు తర్వాత అశ్విన్ కెరీర్ పై అనేక సందేహాలు వచ్చాయి. అతడిని జట్టు నుంచి తప్పించాలంటూ చాలా మంది అభిప్రాయపడ్డారు. ఇక రెండో టెస్టు కోసం ప్రకటించిన జట్టులో కుల్దీప్ ను తప్పించి.. అశ్విన్ ను ఉంచడంపై కూడా విమర్శలు వచ్చాయి.
3/ 8
అయితే ఇవేమి పట్టించుకోని అశ్విన్ రెండో టెస్టులో భారత్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. బౌలింగ్ లో ఆరు వికెట్లు తీయడంతో పాటు భారత రెండో ఇన్నింగ్స్ లో 42 పరుగులు చేసి టీమిండియాను గెలిపించడంలో కీలక పాత్ర పోషించాడు.
4/ 8
ఈ క్రమంలో అశ్విన్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఏకంగా టీమిండియా దిగ్గజ ఆల్ రౌండర్ కపిల్ దేవ్ సరసన నిలిచాడు. టీమిండియా తరఫున టెస్టుల్లో 3 వేల పరుగులతో పాటు 400 పైన వికెట్లు తీసిన ఏకైక ప్లేయర్ గా కపిల్ దేవ్ ఉన్నాడు. తాజాగా ఈ రికార్డను అశ్విన్ కూడా అందుకున్నాడు.
5/ 8
బంగ్లాదేశ్ తో సిరీస్ కు ముందు అశ్విన్ టెస్టుల్లో 442 వికెట్లతో పాటు 2,931 పరుగులు చేశాడు. 3 వేల మైలురాయిని అందుకోవడానికి మరో 69 పరుగుల దూరంలో మాత్రమే నిలిచాడు.
6/ 8
బంగ్లాదేశ్ తో జరిగిన టెస్టు సిరీస్ లో అశ్విన్ 112 పరుగులు చేశాడు. దాంతో సుదీర్ఘ ఫార్మాట్ లో 400 వికెట్లతో పాటు 3 వేల పరుగులు చేసిన రెండో టీమిండియా ప్లేయర్ గా నిలిచాడు.
7/ 8
అశ్విన్ తన కెరీర్ లో ఇప్పటి వరకు 88 మ్యాచ్ ల్లో 3,043 పరుగులతో పాటు 449 వికెట్లు తీశాడు. ఇక కపిల్ దేవ్ 131 మ్యాచ్ ల్లో 434 వికెట్ల తో పాటు 5,248 పరుగులు చేశాడు.
8/ 8
రెండో టెస్టులో భారత్ 3 వికెట్ల తేడాతో నెగ్గింది. దాంతో సిరీస్ ను 2-0తో బంగ్లాదేశ్ ను వైట్ వాష్ చేసింది. రెండో టెస్టులో అద్భుతంగా రాణించిన అశ్విన్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు.