Rashid Khan : కుక్క కాటుకు చెప్పు దెబ్బ అంటే ఇదేనేమో.. ఆస్ట్రేలియాకు వార్నింగ్ ఇచ్చిన అఫ్గానిస్తాన్ స్టార్
Rashid Khan : కుక్క కాటుకు చెప్పు దెబ్బ అంటే ఇదేనేమో.. ఆస్ట్రేలియాకు వార్నింగ్ ఇచ్చిన అఫ్గానిస్తాన్ స్టార్
Rashid Khan : అయితే అనూహ్యంగా ఆస్ట్రేలియా ఈ సిరీస్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డుకు షాకిచ్చింది. తాము వన్డే సిరీస్ నుంచి తప్పుకోవడానికి గల కారణాన్ని కూడా క్రికెట్ ఆస్ట్రేలియా వెల్లడించింది.
ఈ ఏడాది మార్చి నెలలో యూఏఈ (UAE) వేదికగా అఫ్గానిస్తాన్ (Afghnistan)తో మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ను ఆస్ట్రేలియా (Australia) ఆడాల్సి ఉంది. ఈ మేరకు అఫ్గానిస్తాన్ అన్ని ఏర్పాట్లను దాదాపుగా పూర్తి చేసింది.
2/ 7
అయితే అనూహ్యంగా ఆస్ట్రేలియా ఈ సిరీస్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డుకు షాకిచ్చింది. తాము వన్డే సిరీస్ నుంచి తప్పుకోవడానికి గల కారణాన్ని కూడా క్రికెట్ ఆస్ట్రేలియా వెల్లడించింది.
3/ 7
ప్రస్తుతం అఫ్గానిస్తాన్ లో తాలిబన్ ప్రభుత్వం ఉన్న సంగతి తెలిసిందే. అఫ్గానిస్తాన్ లోని మహిళల ప్రాథమిక హక్కులకు భంగం కలిగేలా తాలిబన్ ప్రభుత్వం వ్యవహరిస్తుండటంతో తాము ఆ దేశంతో వన్డే సిరీస్ ను రద్దు చేసుకుంటున్నట్లు ఆస్ట్రేలియా పేర్కొంది.
4/ 7
అయితే దీనిపై అఫ్గానిస్తాన్ టి20 కెప్టెన్ రషీద్ ఖాన్ స్పందించాడు. రాజకీయాలను క్రికెట్ తో ముడి పెట్టడం తప్పంటూ తన అభిప్రాయాన్ని తెలిపాడు.
5/ 7
ప్రస్తుతం అఫ్గానిస్తాన్ కు క్రికెట్ మాత్రమే ఆశాకిరణం అంటూ పేర్కొన్నాడు. కానీ, ఆస్ట్రేలియా ఈ సిరీస్ నుంచి తప్పుకోవడం బాధాకరంగా ఉందంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.
6/ 7
అఫ్గానిస్తాన్ తో క్రికెట్ ఆడటం ఆస్ట్రేలియాకు ఇబ్బందిగా ఉంటే.. తాను బిగ్ బాష్ లీగ్ (ఆస్ట్రేలియా టి20 టోర్నీ)లో ఆడటం కూడా వారిని ఇబ్బందికి గురి చేయొచ్చని పేర్కొన్నాడు.
7/ 7
బిగ్ బాష్ లీగ్ లో తాను ఆడాలో లేదో అనే విషయంపై త్వరలోనే కఠిన నిర్ణయం తీసుకుంటానని రషీద్ ఖాన్ తెలిపాడు. ఇక ఇదే అంశంపై అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా స్పందించింది. ఆస్ట్రేలియా సిరీస్ ను రద్దు చేసుకుంటుందని తాము అనుకోలేదని పేర్కొంది.