వరుసగా రెండో రంజీ సీజన్లో కూడా సర్ఫరాజ్ ఖాన్ (Sarfaraz Khan) బ్యాట్ పరుగుల వరద పారిస్తోంది. ప్రస్తుత సీజన్లో 937 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఫైనల్లో తొలి ఇన్నింగ్స్‌లో ఎంపీపై 134 పరుగులు చేశాడు. దీంతో ముంబై జట్టు 374 పరుగులకు ఆలౌటైంది. (Sarfaraz Khan Instagram)
24 ఏళ్ల సర్ఫరాజ్ 2019-20 రంజీ సీజన్లో 928 పరుగులు చేశాడు. 2 రంజీల్లో 900కి పైగా పరుగులు చేసిన తొలి ముంబై బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. శ్రేయాస్ అయ్యర్, వసీం జాఫర్, అజింక్యా రహానే, రుస్సీ మోడీ, అభిషేక్ నాయర్ ఒక్కోసారి ఈ ఘనత సాధించారు. సచిన్ టెండూల్కర్, వినోద్ కాంబ్లీ వంటి దిగ్గజాలు ఒక సీజన్లో కూడా 900 పరుగుల మార్క్‌ను అందుకోలేకపోయారు. (Sarfaraz Khan Instagram)
డాన్ బ్రాడ్‌మాన్ 234 మ్యాచ్‌ల్లో 95 సగటుతో 28067 పరుగులు చేశాడు. 117 సెంచరీలు, 69 హాఫ్ సెంచరీలు చేశాడు. తర్వాతి స్థానంలో సర్ఫరాజ్ ఖాన్ ఉన్నాడు. ఈ విషయంలో భారత మాజీ వెటరన్ విజయ్ మర్చంట్ మూడో స్థానంలో ఉన్నాడు. అతను 150 మ్యాచ్‌ల్లో 72 సగటుతో 13470 పరుగులు చేశాడు. 45 సెంచరీలు, 52 హాఫ్ సెంచరీలు సాధించాడు. (AFP)
భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ 129 మ్యాచ్‌ల్లో 60 సగటుతో 9965 పరుగులు చేశాడు. 35 సెంచరీలు, 44 హాఫ్ సెంచరీలు చేశాడు. అదే సమయంలో, సచిన్ టెండూల్కర్ 310 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 58 సగటుతో 25396 పరుగులు చేశాడు. 248 పరుగులతో నాటౌట్‌గా అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడాడు. 81 సెంచరీలు, 116 హాఫ్ సెంచరీలు సాధించాడు. (AFP)
ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో సర్ఫరాజ్ ఖాన్ అత్యధిక స్కోరు 301 పరుగులు నాటౌట్. అతను వాస్తవానికి యూపీకి చెందినవాడు. అయితే అతను ఇప్పుడు ముంబై తరఫున ఆడుతున్నాడు. ఇలా ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో దుమ్మురేపుతున్నా.. సర్ఫరాజ్ కి ఇంతవరకు టీమిండియాలో చోటు దక్కలేదు. దీంతో.. చాలా మంది మాజీ క్రికెటర్లు సెలెక్టర్లు తీరుపై మండిపడుతున్నారు. (BCCI Domestic/Twitter)