ఇటీవలి కాలంలో సంజూ సామ్సన్ (Sanju Samson) అద్బుతంగా ఆడుతున్నాడు. టి20 ప్రపంచకప్ (T20 World Cup)కు ముందు భారత్ (India) వేదికగా దక్షిణాఫ్రికా (South Africa)తో జరిగిన వన్డే సిరీస్ లో అద్భుతంగా రాణించాడు. అనంతరం న్యూజిలాండ్ (New Zealand) పర్యటనలో ఒకే ఒక్క మ్యాచ్ లో ఆడిన అతడు కీలక సమయంలో బరిలోకి దిగి శ్రేయస్ అయ్యర్ తో ఒక మంచి ఇన్నింగ్స్ ను ఆడాడు.