క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) అంటే అభిమానుల్లో ఇప్పటికీ క్రేజే. సచిన్ రిటైర్మెంట్ ప్రకటించి దాదాపు 10 ఏళ్లు పూర్తి కావొస్తుంది. ఇక సచిన్ వారసుడు అర్జున్ టెండూల్కర్ (Arjun Tendulkar) టీమిండియా (Team India)కు ఆడితే చూడాలని అతడి అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.
ఇక తాజాగా రంజీ ట్రోఫీలో కూడా అర్జున్ టెండూల్కర్ అరంగేట్రం చేశాడు. రాజస్తాన్ రాయల్స్ తో ఆరంభమైన మ్యాచ్ లో అర్జున్ తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. రంజీల్లో అరంగేట్రం చేసిన అర్జున్ ఇక్కడ మెరిపించి.. ఆ తర్వాత వచ్చే ఏడాది జరిగే ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ తరఫున కూడా ఎంట్రీ ఇవ్వాలని పట్టుదలగా ఉన్నాడు.