ఆ తర్వాత స్కాట్లాండ్ చేతిలో రెండు సార్లు ఛాంపియన్ విండీస్ టీం ఖంగుతింది. సూపర్ -12కు క్వాలిఫై అవ్వడం కోసం ప్రతి జట్టు నువ్వా-నేనా అన్నట్టు పోరాడుతున్నాయి. సూపర్-12 దశకు చేరుకునేందుకు జట్లన్నీ చాలా కష్టపడుతున్నాయి. క్వాలిఫయర్ మ్యాచులే ఇలా రసవత్తరంగా సాగుతుండటంతో ఫ్యాన్స్ కు మంచి కిక్ లభిస్తుంది.
ఇదొక్కటే కాదు.. శనివారం షెడ్యూల్ అయిన ఆస్ట్రేలియా - న్యూజిలాండ్ మ్యాచ్ కూడా రద్దు కావడం ఖాయంగా కనిపిస్తోంది. అక్టోబర్ 23న ఎంసీజీ వేదికగా భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్ కు వర్ష సూచన ఉంది. అక్టోబర్ 23 (ఆదివారం) మెల్ బోర్న్ మొత్తం భారీ వర్షం పడే అవకాశం ఉన్నట్లు అక్కడి వాతావరణ శాఖ పేర్కొంది. ఇప్పటికే ఈ మ్యాచ్ కోసం దాదాపు 90 వేలకు పైగా టికెట్లు అమ్ముడైనట్లు సమాచారం.
సూపర్ -12 మ్యాచుల కోసం అభిమానుల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక, చిరకాల ప్రత్యర్ధులు ఆస్ట్రేలియా వర్సెస్ న్యూజిలాండ్ మరియు భారత్ - పాక్ మ్యాచుల కోసం అయితే వెయ్యికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు వర్షం ఎఫెక్ట్ తో ఈ మ్యాచులు రద్దయితే టోర్నీ అట్టర్ ప్లాప్ అయినట్టే అని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.