RAIN STOPS PLAY ON SECOND DAY OF FIRST TEST INDIA LOSES QUICK WICKETS KL RAHUL HALF CENTURY JNK
INDvENG: రెండో రోజు రెండు సెషన్లే ఆట.. అదరగొట్టిన కేఎల్ రాహుల్, జేమ్స్ అండర్సన్ - Photos
భారత ఓపెనర్లు రెండో రోజు నిలకడైన ఆటను ప్రదర్శించారు. ఇంగ్లాండ్ బౌలర్లను సమర్దవంతంగా ఎదుర్కుంటూ.. స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. అయితే నిరంతరాయంగా పడుతున్న వర్షపు జల్లుల కారణంగా భారత బ్యాట్స్‌మెన్ ఏకాగ్రత కోల్పోయారు.
ఇండియా-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఆటకు వరుణుడు ఆటంకం కలిగించాడు. భారత్ ధాటిగా బ్యాటింగ్ ప్రారంభించినా.. ఆ తర్వాత త్వరగా వికెట్లు కోల్పోయింది.
2/ 13
వర్షం ఆగకుండా కురుస్తుండటంతో ట్రెంట్బ్రిడ్స్లో జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఆట కేవలం రెండు సెషన్లు మాత్రమే జరిగింది. టీ విరామం తర్వాత ఆట సాధ్యపడలేదు.
3/ 13
రెండో రోజు ఆట నిలిపివేసే సమయానికి భారత జట్టు 125/4 స్కోర్ వద్ద నిలిచింది.
4/ 13
రెండో రోజు కేవలం 33.4 ఓవర్ల ఆట మాద్యమే సాధ్యపడింది. ఇందులో అత్యధికంగా తొలి సెషన్లోనే ఆడారు. రెండో సెషన్లో కూడా పలుమార్లు ఆటకు అంతరాయం ఏర్పడింది.
5/ 13
ఇంగ్లాండ్ పేసర్లు జేమ్స్ అండర్సన్, ఓలీ రాబిన్సన్ వికెట్లు తీసి భారత్‌ను ఎదురు దెబ్బ తీశారు.
6/ 13
భారత జట్టు పటిష్టంగా ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఓపెనర్లు నిలకడగా ఆడారు. అయితే ఓలీ రాబిన్సన్ ఒక వికెట్ తీసిన తర్వాత.. జేమ్స్ అండర్సన్ వరుస బంతుల్లో రెండు వికెట్లు పడొట్టి భారత్‌ను కష్టాల్లోకి నెట్టాడు.
7/ 13
మబ్బులు కమ్ముకోవడంతో పిచ్ అనూహ్యంగా మారిపోయింది. దాన్ని ఉపయోగించుకుంటూ జేమ్స్ అండర్సన్ ఆఫ్-స్టంప్ లక్ష్యంగా బంతులు విసిరాడు. దీంతో చతేశ్వర్ పుజార, విరాట్ కోహ్లీలు వికెట్లు కోల్పోయారు
8/ 13
భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ తొలి వికెట్‌కు 97 పరుగులు జోడించారు. అయితే వాతావరణంలో మార్పులతో భారత బ్యాట్స్‌మెన్ ఏకాగ్రత కోల్పోయారు.
9/ 13
రోహిత్ శర్మ నిలకడగా ఆడుతూ భారీ స్కోర్ చేస్తాడనే నమ్మకాన్ని కలిగించాడు.
10/ 13
ఓపెనర్లు రోహిత్, కేఎల్ రాహుల్ భారత జట్టుకు సరైన ఆరంభాన్ని అందించారు.
11/ 13
వీరిద్దరి భాగస్వామ్యంతో ఇంగ్లాండ్ జట్టులో ఆందోళన మొదలైంది. దీంతో వికెట్ల కోసం ఇంగ్లాండ్ బౌలర్లు చెమటోడాల్సి వచ్చింది.
12/ 13
రోహిత్ శర్మ చెత్త బంతులను వదిలేస్తే మంచి డిఫెన్సింగ్ ఆట ఆడాడు. కానీ ఓలీ రాబిన్ సన్ చేతికి చిక్కాడు.
13/ 13
గోడలా అడ్డుకుంటాడనుకున్న పుజార 4, విరాట్ కోహ్లీ గోల్డెన్ డక్ కావడంతో భారత జట్టు పరుగుల వేగం తగ్గిపోయింది.