జాతీయ క్రికెట్ అకాడమీ (NCA) ‘హెడ్ ఆఫ్ క్రికెట్’ పదవికి దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ ఒక్కడే మళ్లీ దరఖాస్తు చేసుకోగా ఇంకెవరు పోటీలో లేరు. దీంతో అతనే మరో సారి ఎన్సీఏ చీఫ్గా ఖాయమైనప్పటికీ విమర్శలకు తావివ్వరాదనే ఉద్దేశంతో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) దరఖాస్తు గడువును పొడిగించింది.
రెండేళ్ల క్రితం ఎన్సీఏ చీఫ్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ద్రావిడ్ తనదైన ముద్ర వేశాడు. కుర్రాళ్లకు, పునరావాస శిబిరానికి వచ్చిన ఆటగాళ్లకు మార్గదర్శకుడిగా మారాడు. రాహుల్ ద్రావిడ్.. రెండేళ్ల కాలానికిగానూ 2019 జులైలో జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) డైరెక్టర్గా బాధ్యతలు తీసుకున్నారు. దీంతో పాటు భారత అండర్-19, భారత-ఏ జట్లకు కోచ్గా వ్యవహరిస్తున్నారు.