PBL 4: సైనాకు షాకిచ్చిన సింధు...బ్యాడ్మింటన్ లీగ్‌లో మరో సంచలనం

ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ 4వ సీజన్‌‌లో భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్‌ను సింధు ఓడించింది. తొలి మ్యాచ్‌లో ఒలింపిక్ మెడలిస్ట్ కరోలిన్ మారిన్‌ను ఓడించడంతో పాటు సైనాను సైతం చిత్తు చేసి సింధు తనకు తాను మాత్రమే సాటి అనిపించుకుంది.