ఇదే హోటల్లో మ్యాచ్ అధికారులు, మేనేజ్మెంట్, బ్రాడ్కాస్ట్ సిబ్బంది కోసం మరో బయోబబుల్ సృష్టించారు. ప్రో కబడ్డీ లీగ్‌కు సంబంధించిన వారికి ప్రత్యేకమైన ఫ్లోర్ కేటాయించడమే కాకుండా.. కన్వెన్షన్ సెంటర్ మొత్తం పీకేఎల్ నిర్వాహకుల చేతిలోనే ఉంటుంది. కాబట్టి రాబోయే నెలన్నర పాటు అక్కడ ఎలాంటి ఇతర కార్యక్రమాలు నిర్వహించబోవడం లేదు.