PRITHVI SHAW INDIAN CRICKETER GETS BAN UNDER DOPING DUE TO COUGH SYRUP MK
Prithvi Shaw: కొంపముంచిన దగ్గు మందు...డోపింగ్ టెస్టులో యువ క్రికెటర్ పృథ్వీషా బలి...
Prithvi Shaw Banned: భారత యువ క్రికెటర్ పృథ్వీ షాకు డోపింగ్ టెస్టులో విఫలం కావడంతో బీసీసీఐ అతనికి ఎనిమిది నెలల పాటు నిషేధం విధించింది. కాగా ఈ నిషేధం మార్చి 16నుంచి నవంబరు 15 వరకు అమలు కానుంది.
భారత యువ క్రికెటర్ పృథ్వీ షాకు డోపింగ్ టెస్టులో విఫలం కావడంతో బీసీసీఐ అతనికి ఎనిమిది నెలల పాటు నిషేధం విధించింది. కాగా ఈ నిషేధం మార్చి 16నుంచి నవంబరు 15 వరకు అమలు కానుంది. (Image : News18 Tamil)
2/ 6
19 ఏళ్ల పృథ్వీ షా గత ఫిబ్రవరి 22న షాకు డోపింగ్ పరీక్షలకు హాజరయ్యాడు. షా ఇచ్చిన శాంపిల్‌లో ‘వాడా’ నిషేధిత జాబితాలో ఉన్న టెర్బుటలైన్ పదార్థం తేలింది. (Image : News18 Tamil)
3/ 6
డోపింగ్ పరీక్షలో ఫెయిల్ అయిన పృథ్వీషాపై బీసీసీఐ యాంటీ డోపింగ్ నిబంధనల ప్రకారం తాత్కాలిక నిషేధం విధించింది. (Image : News18 Tamil)
4/ 6
అయితే తాను దగ్గు తగ్గేందుకు మాత్రమే సిరప్ తీసుకున్నట్లు అందులో నిషేధిత టెర్బుటలైన్ పదార్థం ఉందనే సంగతి తనకు తెలియదని షా విచారణలో తెలిపాడు. (Image : News18 Tamil)
5/ 6
డోపింగ్‌లో పాజిటివ్‌గా తేలిన పృథ్వీ షా ఉద్దేశపూర్వకంగా డ్రగ్‌ను తీసుకోలేదనే వాదనను బీసీసీఐ నమ్ముతున్నట్లు ప్రకటించింది. నిషేధిత టెర్బుటలైన్ పదార్థం కాఫ్ సిరప్ లో కనిపించడం సహజమని బీసీసీఐ తెలిపింది. (Image : News18 Tamil)
6/ 6
ఇదిలా ఉంటే పృథ్వీ షా మరో నాలుగు నెలల పాటు ఆటకు దూరం కానున్నాడు. (Image : News18 Tamil)