హీరోయిన్స్‌తో క్రికెటర్లు (Cricketers) ప్రేమలో పడటం సాధారణమే విషయమే. ఇప్పటికే టిమిండియా (Team India) క్రికెటర్లు పలువురు బాలీవుడ్ (Bollywood) భామలతో ప్రేమ వ్యవహరం నడిపిన సంగతి తెలిసిందే. అందులో కొందరు బ్రేకప్ చెప్పుకుని విడిపోగా.. మరికొందరూ ఏడడుగులు వేసి ఒక్కటయ్యారు. అయితే.. ఎక్కువ మంది బ్రేకప్ చెప్పుకుని ఎవరి దారి వారు చూసుకున్నారు. (Image Credit : Instagram)
ఇక తాజాగా ఈ జాబితాల్లోకి యంగ్ క్రికెటర్ పృథ్వీ షా (Prithvi Shaw) చేరాడు. అతడు కొంతకాలంగా బాలీవుడ్ హీరోయిన్ ప్రాచీ సింగ్ (Prachi Singh)తో సన్నిహితంగా ఉంటున్న సంగతి తెలిసిందే.ఇద్దరు కలిసి పార్టీలకు, డిన్నర్ డేట్స్ వెళుతూ కెమెరాలకు చిక్కారు. దీంతో పృథ్వీ, ప్రాచీ ప్రేమలో మునిగితేలుతున్నాడంటూ కొద్ది రో జులుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ప్రాచీని పృథ్వీషా రూమర్డ్ గర్ల్‌ఫ్రెండ్‌గా అంతా పేర్కొంటున్నారు. (Image Credit : Instagram)