Saina Biopic : కరోనా ఎఫెక్ట్ తో ఓటీటీ లో సైనా నెహ్వాల్ బయోపిక్ రిలీజ్..?
Saina Biopic : కరోనా ఎఫెక్ట్ తో ఓటీటీ లో సైనా నెహ్వాల్ బయోపిక్ రిలీజ్..?
Saina Biopic : గత కొన్నేళ్లుగా బయోపిక్స్ సినిమాల హవా నడుస్తోంది . బాలీవుడ్లో బయోపిక్‌లు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్నాయి. దీంతో క్రీడాకారుల జీవితాన్ని వెండి తెరపై ఆవిష్కరించడానికి నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు.
గత కొన్నేళ్లుగా బయోపిక్స్ సినిమాల హవా నడుస్తోంది . బాలీవుడ్లో బయోపిక్‌లు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్నాయి. దీంతో క్రీడాకారుల జీవితాన్ని వెండి తెరపై ఆవిష్కరించడానికి నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. (Photo Credit : Instagram)
2/ 10
మేరీకోమ్, ధోని, సచిన్, మిల్కా సింగ్ వంటి అనేకమంది క్రీడాకారుల జీవితాలు సినిమాలుగా తెరక్కెక్కాయి.. సక్సెస్ అందుకున్నాయి. తాజాగా మరో క్రీడాకారిణి జీవితం వెండి తెరపై ఆవిష్కృతం కానున్నది. (Photo Credit : Instagram)
3/ 10
ప్రస్తుతం బాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ జీవిత కథ ఆధారంగా బయోపిక్ తెరకెక్కుతుంది. ఈ సినిమాలో సైనా నెహ్వాల్ పాత్రలో పరిణితీ చోప్రా నటిస్తోంది. అమోల్ గుప్తా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్ నిర్మిస్తున్నాడు. (Photo Credit : Instagram)
4/ 10
ఈ సినిమా షూటింగ్ కోసం పరిణితీ చోప్రా బాడ్మింటన్ నేర్చుకుంటూ చాలానే కష్టపడుతుంది. లుక్‌లో కూడా సైనానే తలపించేలా ఉంది. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా కరోనా కారణంతో వాయిదా పడింది. (Photo Credit : Instagram)
5/ 10
అయితే తాజాగా ఈ సినిమాను థియేటర్స్ లో రిలీజ్ చేయడానికి చిత్ర నిర్మాత ఇష్టపడడం లేదని తెలుస్తోంది. పూర్తి స్థాయిలో థియేటర్స్ లో ప్రేక్షకులను అనుమతించడం లేదు కనుక సినిమా రిలీజ్ కోసం సరైన సమయంలో చిత్ర బృందం ఎదురుచూస్తుంది బీ టౌన్ టాక్. (Photo Credit : Instagram)
6/ 10
ఇక మరోవైపు ఈ బయోపిక్ ను ఓటిటీ లో రిలీజ్ చేయడానికి నిర్మాత ఆసక్తి చూపిస్తున్నారని బాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. (Photo Credit : Instagram)