లాహోర్‌లోని గడ్డాఫీ స్టేడియంలో ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌కు చెందిన 30 ఏళ్ల మహిళా బ్యాటర్ సిద్రా అమీన్ చరిత్ర సృష్టించింది. అమీన్ 151 బంతుల్లో 20 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 176 పరుగులు చేసింది. మహిళల వన్డే క్రికెట్ చరిత్రలో ఇది 5వ అతిపెద్ద ఇన్నింగ్స్. ఆమె ఇన్నింగ్స్ కారణంగా ఐర్లాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో పాకిస్థాన్ జట్టు 3 వికెట్ల నష్టానికి 335 పరుగులు చేయగలిగింది. (PC : sidraamin31)
మహిళల వన్డే క్రికెట్లో సిద్రా అమీన్ కంటే ముందు నలుగురు మహిళా బ్యాటర్లు మాత్రమే అత్యధిక వ్యక్తిగత స్కోర్లు సాధించారు. మహిళా క్రికెట్ లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన రికార్డు న్యూజిలాండ్‌కు చెందిన 22 ఏళ్ల బ్యాట్స్‌మెన్ అమేలియా కెర్ పేరిట ఉంది. 4 ఏళ్ల క్రితం ఐర్లాండ్‌పై అజేయంగా 232 పరుగులు చేసింది. (PC : sidraamin31)