లేటెస్ట్ గా అత్యాచారం కేసులో పాకిస్థాన్ వెటరన్ లెగ్ స్పిన్నర్ యాసిర్ షాపై ఎఫ్ఐఆర్ నమోదైంది. యాసిర్, అతని స్నేహితుడు ఫర్హాన్ తనను వేధించారని ఇస్లామాబాద్‌కు చెందిన 14 ఏళ్ల బాలిక చేసిన ఆరోపణల నేపథ్యంలో యాసిర్‌పై కేసు బుక్కైంది. ఫర్హాన్‌ను పెళ్లి చేసుకోవాలని యాసిర్ ఫోన్ చేసి బెదిరించినట్లు ఆ అమ్మాయి పేర్కొంది.
రిటైర్మెంట్ ప్రకటించి, మళ్లీ వెనక్కివస్తూ సుదీర్ఘ క్రికెట్ కెరీర్ కొనసాగించాడు పాక్ మాజీ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిదీ. తన కెరీర్‌లాగే ఆఫ్రిదీ జీవితంలో వివాదాలు చాలా ఎక్కువే. ఓ టోర్నీ కోసం సింగపూర్ వెళ్లిన ఆఫ్రిదీ, అక్కడ మరో క్రికెటర్‌తో కలిసి ఇద్దరు అమ్మాయిలతో గడుపుతూ దొరికిపోయాడు. సెక్స్ స్కాండిల్‌లో దొరికిన ఆఫ్రిదీని 2000 ఐసీసీ ఛాంపియన్స్ట్రోఫీ నుంచి తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది పాక్ క్రికెట్ బోర్డు.
మైదానంలో చూడటానికి ప్రశాంతంగా కనిపించే పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్.. పైకి కనిపించేంత మంచివాడు కాదని ఆయన మాజీ ప్రేయసి గా చెప్పుకుంటున్న హమీజా ముఖ్తార్ (Hameeza Mukhtar) ఆరోపించిన సంగతి తెలిసిందే. తనను లైంగికంగా వేధించేవాడని (Sexual Harassement), ఇద్దరం కలిసి చాలా కాలం పాటు కలిసున్నామని చెప్పుకొచ్చింది. తనను లైంగికంగా వాడుకుని.. కడుపు చేసి.. ఆపై అబార్షన్ చేయించాడని వాపోయింది.