2011 World cup : ఈ పాక్ బౌలర్ ను ఎవడికైనా చూపించండ్రా బాబు.. అలా వదిలేయకండి.. చాలా డేంజర్ గా ఉన్నాడు..
2011 World cup : ఈ పాక్ బౌలర్ ను ఎవడికైనా చూపించండ్రా బాబు.. అలా వదిలేయకండి.. చాలా డేంజర్ గా ఉన్నాడు..
shoaib akhtar : ప్రపంచకప్ జట్టులో అక్తర్ ఉన్నా.. ఫిట్ గా లేడంటూ సెమీఫైనల్ మ్యాచ్ లో అతడిని ఆడించలేదు. ఆ మ్యాచ్ లో తాను ఆడి ఉండాల్సిందని అభిప్రాయపడ్డ అక్తర్.. ఆడింటే తప్పకుండా భారత్ ను ఓడించి పాకిస్తాన్ ను ఫైనల్ చేర్చే వాడినంటూ బీరాలు పలికాడు.
[caption id="attachment_1330362" align="alignnone" width="1600"] మనుషుల్లో చాలా రకాలు ఉంటారు. ఏదైనా ఘటన జరిగి అందులో మనకు ప్రతికూల ఫలితం వచ్చినట్లయితే.. ’నేను కానీ అక్కడ ఉండి ఉంటేనా కథ వేరేలా ఉండేది‘ అంటూ గొప్పలకు పోయేవారు అందులో ఒక రకానికి చెందినవారు. (PC : TWITTER)
[/caption]
2/ 6
సరిగ్గా ఇప్పుడు అటువంటిదే పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ విషయంలో జరిగింది. తాజాగా అతడు 2011 వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్ మ్యాచ్ గురించి మాట్లాడాడు. మొహాలీ వేదికగా జరిగిన సెమీఫైనల్లో భారత్, పాకిస్తాన్ జట్లు తలపడగా.. అందులో భారత్ ఘనవిజయం సాధించింది.
3/ 6
ప్రపంచకప్ జట్టులో అక్తర్ ఉన్నా.. ఫిట్ గా లేడంటూ సెమీఫైనల్ మ్యాచ్ లో అతడిని ఆడించలేదు. ఆ మ్యాచ్ లో తాను ఆడి ఉండాల్సిందని అభిప్రాయపడ్డ అక్తర్.. ఆడింటే తప్పకుండా భారత్ ను ఓడించి పాకిస్తాన్ ను ఫైనల్ చేర్చే వాడినంటూ బీరాలు పలికాడు.
4/ 6
అయితే ఇక్కడ షోయబ్ అక్తర్ ఒక్క విషయాన్ని మర్చిపోయాడు. సౌతాఫ్రికా వేదికగా జరిగిన 2003 వన్డే ప్రపంచకప్ లోనూ భారత్, పాకిస్తాన్ జట్లు తలపడ్డాయి. అప్పుడు అక్తర్ పాకిస్తాన్ తరఫున ఆడాడు. ఆడటమే కాదు సచిన్, సెహ్వాగ్ బ్యాట్లకు బలి కూడా అయ్యాడు.
5/ 6
భీకర ఫామ్ లో ఉన్న ఆ సమయంలోనే పెద్దగా ప్రభావం చూపలేకపోయిన అక్తర్.. ఇక కెరీర్ చరమాంకంలో ఉన్న సమయంలో ఏ విధంగా భారత్ ను హడలెత్తించేవాడో అతడికే తెలియాలి.
6/ 6
సెమీస్ లో నెగ్గిన భారత్ ఫైనల్ కు చేరగా.. అక్కడ శ్రీలంకను ఓడించి 28 ఏళ్ల తర్వాత మరోసారి వన్డే ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడింది. ఇక మ్యాచ్ అనంతరం వాంఖడే స్టేడియంలో సచిన్ ను టీమిండియా ప్లేయర్లు భుజాలపై మోయడం ప్రతి ఒక్క క్రికెట్ అభిమానికి ఇప్పటికీ గుర్తుండే ఉంటుంది.