దీనికి తోడు.. విరాట్ కోహ్లీ సెంచరీ చేసి రెండేళ్లు దాటిపోయింది. దీంతో.. ప్రతి ఒక్కరూ కోహ్లీని టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్నారు. దీంతో, కోహ్లీని టార్గెట్ చేసుకుని అవాకులు చేవాకులు పేలుతున్నారు మాజీ క్రికెటర్లు. ఇప్పుడు ఈ లిస్ట్ లో పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ (Shoiab Akthar) చేరిపోయాడు.
బాలీవుడ్ నటీ అనుష్క శర్మను పెళ్లి చేసుకోవడం వల్లే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ రాత మారిందంటూ పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ అన్నాడు. పెళ్లి విషయంలో కోహ్లీ తొందరపడ్డాడని తెలిపాడు. పెళ్లి అనేది విరాట్ బ్యాటింగ్‌పై ప్రభావం చూపిందన్నాడు. అతని ప్లేస్‌లో తాను ఉంటే పెళ్లి కూడా చేసుకోకపోయేవాడినని అక్తర్ స్పష్టం చేశాడు.
విరాట్ కోహ్లీ ఫామ్ గురించి ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. " నేనే విరాట్ కోహ్లీ ప్లేస్‌లో ఉంటే పెళ్లి కూడా చేసుకునేవాడిని కాదు. కేవలం పరుగులు చేస్తూ.. క్రికెట్‌ను ఎంజాయ్ చేసేవాడిని. బ్యాటర్ గా ఈ 10-12 ఏళ్ల సమయం ఎప్పటికీ తిరిగిరాదు. పెళ్లి చేసుకోవడం తప్పని చెప్పడం లేదు. ఎప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఉండాలని కూడా అనడం లేదు. అయితే భారత జట్టుకు ఆడుతున్నప్పుడు ఆ కాస్త సమయాన్ని క్రికెట్‌కు కేటాయించి ఆస్వాదించాలంటున్నా.
విరాట్ కోహ్లీ అంటే అభిమానులకు పిచ్చి.. గత 14 ఏళ్లుగా విరాట్ పొందుతున్న ఆధరాభిమానుల ముందు వైవాహిక జీవితం చాలా చిన్నది. పెళ్లి అయితే కుటుంబం, పిల్లలు అనే ఒత్తిడి ఉంటుది. కుటుంబ బాధ్యతలు పెరిగే కొద్దీ, క్రికెట్‌పై పూర్తి స్థాయి దృష్టిని పెట్టలేం. ఇప్పుడు విరాట్ కోహ్లీ ఫామ్‌ను అందుకోకపోవడానికి అదే కారణమని అనుకుంటున్నా. పెళ్లయ్యాక విరాట్ కోహ్లీ ఇంతకుముందులా పరుగులు చేయలేదనే నా ఉద్దేశం." అని అక్తర్ చెప్పుకొచ్చాడు.