టి20 ప్రపంచకప్ తర్వాత టీ-20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి విరాట్ కోహ్లీ (Virat Kohli) తప్పుకున్నాడు. ఈ నేపథ్యంలో కోహ్లి స్థానంలో మరో సీనియర్ క్రికెటర్ రోహిత్ శర్మను ఈ ఫార్మాట్లో కెప్టెన్గా నియమిస్తారని ప్రచారం జరిగింది. ఎలాంటి సంచలనాలకు తావివ్వకుండా బీసీసీఐ సెలెక్షన్ కమిటీ రోహిత్ శర్మకే టి20 పగ్గాలు అప్పగించింది. కేఎల్ రాహుల్ (KL Rahul) వైస్ కెప్టెన్గా వ్యవహరిస్తాడు.
భారత టీ20 ఫార్మాట్ కెప్టెన్గా విరాట్ కోహ్లీ స్థానంలో రోహిత్ శర్మ, కొత్త కోచ్గా రాహుల్ ద్రావిడ్ రావడంతో, జట్టు కొత్త శకానికి నాంది పలకనుంది. అయితే, రోహిత్ పగ్గాలందుకోవడంతో విరాట్ కోహ్లీ దూకుడు కళ్లెం పడినట్టే అని వార్తలు వస్తున్నాయ్. కోహ్లీ దూకుడు తగ్గించడానికే బీసీసీఐ ఇలా ప్లాన్ వేసిందంటూ ఫ్యాన్స్ భావిస్తున్నాడు.