టీ-20 వరల్డ్‌కప్ (T-20 World Cup) 2022 నుంచి భారత్ (Team India) అవమానకర రీతిలో నిష్క్రమించింది. ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో కనీసం పోటీ కూడా ఇవ్వకుండా ఘోర ఓటమిని మూటగట్టుకుంది. దీంతో పొట్టి ఫార్మాట్ లో 2007 తరువాత వరల్డ్ కప్‌ను ముద్దాడాలనే కల తీరుకుండానే ఆస్ట్రేలియా నుంచి ఇంటి బాట పట్టింది.
ఇక, లేటెస్ట్ గా ఇదే విషయంపై పాక్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ ఆసక్తి కర వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచకప్ లో ఓటమి పాలైనంత మాత్రాన కెప్టెన్సీలో మార్పు చేయాలనడం సరికాదని వ్యాఖ్యానించాడు. అలాగే, ఐపీఎల్ కప్పులు సాధించినంత మాత్రనా టీమిండియాకు కెప్టెన్ చేయడం సరికాదని హార్దిక్ ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు.
" హార్దిక్ పాండ్యా మంచి ఆటగాడు. ఐపీఎల్ లో కెప్టెన్ కూడా సక్సెస్ అయ్యాడు. కానీ.. టీమిండియా లాంటి టాప్ టీంను నడపడం అంత ఈజీ కాదు. ఇక, రోహిత్ శర్మ.. ఐపీఎల్ లో ఐదు సార్లు కెప్టెన్ గా టైటిల్ సాధించాడు. ఇప్పుడు మెగాటోర్నీలో విఫలమైనంత మాత్రనా అతన్ని కెప్టెన్సీ నుంచి తొలగించాలనుకోవడం సరికాదు. ఒకవేళ.. టీ20 ప్రపంచకప్ లో రోహిత్ బ్యాట్ నుంచి మంచి ఇన్నింగ్స్ లు వచ్చి ఉంటే.. ఇలాంటి వ్యాఖ్యలు చేసేవారు కాదు. క్రికెట్ గురించి తెలిసినవారు ఇలా మాట్లాడారని అనుకుంటున్నాను " అని కీలక వ్యాఖ్యలు చేశాడు సల్మాన్ భట్.