రషీద్ లతీఫ్ తన యూట్యూబ్ ఛానెల్లో.. ' ఆధునిక క్రికెట్ భిన్నంగా ఉంది. బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ... ప్రతీ ఒక్కరికీ ఏదో ఒక వీక్నెస్ ఉంది. ఇప్పుడు అందుబాటులో ఉన్న టెక్నాలజీ కారణంగా ఆ వీక్నెస్ని ఇట్టే పసిగడుతున్నారు బౌలర్లు... అయితే వాళ్లు గేమ్‌ని మార్చుకోవడానికి మాత్రం ప్రయత్నించడం లేదు.
విరాట్ కోహ్లీ లాగే కేన్ విలియంసన్ కూడా ఇదే రకమైన పరిస్థితిని ఫేస్ చేస్తున్నాడు. విరాట్‌కి షార్ట్ లెంగ్త్ డెలీవరీలే వీక్నెస్. ఇప్పుడు విరాట్ కోహ్లీ ఫామ్‌లోకి రావాలంటే బెస్ట్ కోచ్‌లను కలిసి మాట్లాడాలి, తన వీక్నెస్ను తొలగించుకోవడానికి కృషి చేయాలి... క్లియర్‌గా చెప్పాలంటే మళ్లీ బేసిక్స్ నుంచి మొదలెట్టాలి. ' అని మాట్లాడాడు.
అలాగే.. కోహ్లి పేలవమైన ఫామ్‌కు సంబంధించి బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఇటీవల చేసిన ప్రకటనపై అభ్యంతరం వ్యక్తం చేశాడు లతీఫ్. కోహ్లీ ఫామ్ గురించి గంగూలీ మాట్లాడుతూ.. దాని నుంచి బయటపడే మార్గం కోహ్లీనే కనుగొనాలి అంటూ కామెంట్ చేశాడు. గంగూలీ చేసిన ఈ ప్రకటనను ఇష్టపడని లతీఫ్.. ఫైరయ్యాడు. కోహ్లీని బలిపశువుగా గంగూలీ చేస్తున్నాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.