ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) బీసీసీఐ (BCCI) పాలిట కామధేనవు. ఆ విషయాన్ని మరో సారి రుజువు చేస్తూ.. బీసీసీఐపై మరోసారి కాసుల వర్షం కురిపించింది ఈ ధనాధన్ లీగ్. వచ్చే ఐదేళ్లకు (2023-27)గానూ ఐపీఎల్ మీడియా రైట్స్ (IPL Media Rights) ను కనీవినీ ఎరుగని రీతిలో విక్రయించింది. కాసుల వర్షం కురిపించే ఐపీఎల్ మీడియా రైట్స్ ను సొంతం చేసుకునేందుకు దేశంలోని చానెల్స్ పోటీ పడ్డాయి. దీంతో మీడియా రైట్స్ ధర ఆకాశానికి తాకింది.
ఐపీఎల్ ఐదేళ్ల మీడియా రైట్స్ వల్ల బీసీసీఐ ఖజానాలో రూ. 48, 390 కోట్లు చేరాయి. 2018-2022కు గానూ ఐపీఎల్ మీడియా రైట్స్ ను కేవలం 16,347 కోట్లకే డిస్సీ స్టార్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు ఆ ధర మూడింతలు కావడం ఐపీఎల్ క్రేజ్ ను చెప్పకనే చెబుతున్నాయి. ఇలాంటి క్రేజ్ ఉన్న లీగ్ లో ఆడటానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న మేటి క్రికెటర్లు ఆసక్తి చూపుతున్నారు.
ఐపీఎల్ కోసం రెండున్నర నెలల పాటు టైం కేటాయిస్తే.. అంతర్జాతీయ క్రికెట్ పై దీని ప్రభావం పడనుందన్నది పీసీబీ వాదన. అంతేకాకుండా.. పాక్ ఆటగాళ్లకు ఐపీఎల్ లో ఆడే అనుమతి లేదు. 2008 నవంబర్ 26న ముంబైపై ఉగ్రవాదులు జరిపిన దాడుల తర్వాత పాక్ ఆటగాళ్లను ఐపీఎల్లో ఆడేందుకు అనుమతించలేదు. ఈ విషయాన్ని కూడా మనసులో పెట్టుకుని పీసీబీ ఐపీఎల్ పై చాడీలు చెప్పడానికి లిస్ట్ రెడీ చేసుకుంది. ఐసీసీ కూడా బీసీసీఐ వైపే మొగ్గు చూపడంతో ఇతర దేశాల క్రికెట్ బోర్డు అధికారులతో చర్చించి.. వ్యతిరేక గళం విన్పించడానికి పీసీబీ స్కెచ్ వేస్తున్నట్లు సమాచారం.