యూట్యూబ్ చానెల్ లో పోస్ట్ చేసిన వీడియోలో మాట్లాడిన కనేరియా ’నేను పంత్ కీపింగ్ స్కిల్స్ గురించి మాట్లాడాలనుకుంటున్నా. ఫాస్ట్ బౌలర్లు బౌలింగ్ చేసే సమయంలో పంత్ కీపింగ్ లో నేను ఒక విషయం గమనించాను. పేసర్లు బౌలింగ్ చేస్తున్న సమయంలో పంత్ మోకాళ్లపై కూర్చొని కీపింగ్ చేయలేకపోతున్నాడు‘ అని కనేరియా పేర్కొన్నాడు.