పాకిస్థాన్‌తో తొలి టెస్టులో న్యూజిలాండ్ పట్టు సాధించింది. న్యూజిలాండ్ తమ ఫస్ట్ ఇన్నింగ్స్ లో తొమ్మిది వికెట్ల నష్టానికి 612 పరుగుల స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. దీంతో.. 174 పరుగుల భారీ ఆధిక్యాన్ని దక్కించుకుంది కివీస్. ఇక, న్యూజిలాండ్ మాజీ సారథి కేన్ విలియమ్సన్ దుమ్మురేపే డబుల్ సెంచరీతో అజేయంగా నిలిచాడు.
కేన్ విలియమ్సన్ (395 బంతుల్లో 200 పరుగులు నాటౌట్ ; 21 ఫోర్లు, 1 సిక్సర్) డబుల్ సెంచరీతో పాక్ బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. పాక్ బౌలర్లు ఎన్ని విధాలా ప్రయత్నించినా.. కేన్ మామ వికెట్ తీయలేకపోయారు పాక్ బౌలర్లు. కేన్ మామతో పాటు టామ్ లాథమ్ 113 పరుగులతో రాణించాడు. డేవాన్ కాన్వే (92 పరుగులు), ఇష్ సోథీ (65 పరుగులు) హాఫ్ సెంచరీలతో రాణించారు.
అలా పాకిస్తాన్‌తో సిరీస్‌కు ముందే కెప్టెన్సీ నుంచి పక్కకు తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. బ్యాటింగ్‌పై దృష్టి పెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని.. పాకిస్తాన్‌తో టెస్టు సిరీస్‌లో కచ్చితంగా సెంచరీ చేస్తానని పేర్కొన్నాడు. తాజా శతకంతో ఇచ్చిన మాటను కేన్ మామ సగర్వంగా నిలబెట్టుకున్నాడు. ఇక కేన్ విలియమ్సన్ టెస్టు కెరీర్లో ఇది 25వ శతకం కావడం విశేషం.