పాకిస్తాన్ యువ సంచలనం అబ్రార్ అహ్మద్ అరంగేట్ర టెస్టులోనే సంచలన ప్రదర్శన చేశాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో పాక్ స్పిన్ బౌలర్ అబ్రార్ అహ్మద్ రికార్డు పుస్తకాల్లో తన పేరును లిఖించుకున్నాడు ఈ 24 ఏళ్ల యువ బౌలర్ తన అరంగేట్రం మ్యాచ్‌లోనే ఏడు వికెట్లు తీసి ప్రత్యేక రికార్డు సృష్టించాడు. (AP)
ముల్తాన్ వేదికగా పాకిస్తాన్, ఇంగ్లండ్ జట్ల మధ్య శుక్రవారం రెండో టెస్టు ఆరంభం అయింది. మొదటి టెస్టు పరాభవం తర్వాత.. ఈ మ్యాచులో పాకిస్తాన్ అదరగొట్టింది. అబ్రార్ అహ్మద్ స్పిన్ ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 51.4 ఓవర్లలో 281 పరుగులకు ఆలౌటైంది. బెన్ డకెట్ (63), ఓలీ పోప్ (60) టాప్ స్కోరర్లు.
అబ్రార్ (144/7) సంచలన బౌలింగ్‌తో 7 వికెట్స్ పడగొట్టగా.. జాహిద్ మహ్మద్ 3 వికెట్లు తీశాడు. మూడు టెస్టుల మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా రావల్పిండిలో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లీష్ జట్టు 74 పరుగుల తేడాతో విజయం సాధించి 1-0 తేడాతో ఆధిక్యంలో ఉంది. దాంతో రెండో టెస్టులో గెలుపొంది సిరీస్‌ను సమం చేయాలని పాక్ చూస్తోంది.
అబ్రార్ అహ్మద్ తీసిన అన్ని వికెట్లలో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్‌ను అవుట్ చేసిన బాల్ హైలెట్ అని చెప్పాలి. అబ్రార్ అద్భుతమైన గూగ్లీ సాధించగా.. డిఫెన్స్ ఆడే క్రమంలో స్టోక్స్ ముందుకు వచ్చాడు. బంతి బ్యాటుకు కనెక్ట్ కకాకపోవడంతో మిడిల్ స్టంప్ ఎగిరిపోయింది. దీంతో స్టోక్స్ మతిపోయింది. దీంతో, అబ్రార్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. (AP)