బెన్ స్టోక్స్ (Ben Stokes) నాయకత్వంలో ఇంగ్లండ్ జట్టు టెస్టు క్రికెట్ ఆడే విధానమే మారిపోయింది. ఇంగ్లీష్ ఆటగాళ్ల మైండ్ సెట్ పూర్తిగా మారిపోయింది. దూకుడు మంత్రంతో ప్రత్యర్థి జట్లపై విరుచుకుపడుతున్నారు. లేటెస్ట్ గా ఆ దూకుడుకు పాక్ జట్టు బలైపోయింది. పాకిస్థాన్‌తో 3 మ్యాచ్‌ల టెస్టు సిరీస్ గురువారం ప్రారంభమైంది. రావల్పిండి వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ తొలి రోజు 4 వికెట్ల నష్టానికి 506 పరుగులు చేసింది. (AP)
అంతకుముందు 1910లో సిడ్నీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో ఆస్ట్రేలియా తొలి రోజు అత్యధికంగా 494 పరుగులు చేసింది. ఆ రికార్డును ఇప్పుడు ఇంగ్లండ్ జట్టు బ్రేక్ చేసింది. ఈ విధంగా 112 ఏళ్ల రికార్డును ఇంగ్లిష్ జట్టు ధ్వంసం చేసింది. ఆ మ్యాచులో తొలి రోజు ఇద్దరు ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ సెంచరీలు చేశారు.
ఇంగ్లండ్ తరఫున జాక్ క్రౌలీ 122, బెన్ డకెట్ 107, ఒలీ పోప్ 108, హ్యారీ బ్రూక్ 101 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. మ్యాచ్‌లో తొలిరోజు నలుగురు బ్యాట్స్‌మెన్ సెంచరీలు చేయడం టెస్టు చరిత్రలో ఇదే తొలిసారి. పాకిస్తాన్ బౌలర్లు ప్రతి ఒక్కరూ 5.50 పైగా పరుగులు సమర్పించుకున్నారు. (England Cricket Twitter)
ఇంగ్లండ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 1000 పరుగులకు చేరువ అవుతుందా లేదా అనే దానిపైనే ఇప్పుడు అందరి దృష్టి ఉంది. ఇప్పటి వరకు కేవలం 2 జట్లు మాత్రమే 900కు పైగా పరుగులు చేశాయి. 1997లో భారత్‌పై శ్రీలంక 952 పరుగులు చేయడం ద్వారా టెస్టు క్రికెట్లో అతిపెద్ద స్కోరు సాధించింది. అదే సమయంలో 1938లో ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్ 903 పరుగులు చేసింది. (Twitter)