షార్జా వేదికగా పాకిస్తాన్‌తో జరిగిన రెండో టీ20లోనూ సంచలన విజయం సాధించింది ఆఫ్గానిస్తాన్. ఈ మ్యాచ్‌లోనూ పాకిస్థాన్ 7 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. దీంతో.. మూడు టీ20ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఆఫ్గాన్ సొంతం చేసుకుంది. కాగా పాకిస్తాన్‌పై టీ20 సిరీస్‌ను గెలుచుకోవడం ఆఫ్గానిస్తాన్‌కు ఇదే తొలి సారి. (Afghanistan Cricket Board Twitter)
ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 130 పరుగులు మాత్రమే చేసింది. ఇమాద్ వసీమ్(57 బంతుల్లో 3 ఫోర్లు 2 సిక్స్‌లతో 64 నాటౌట్) మినహా అంతా విఫలమయ్యారు. అఫ్గాన్ బౌలర్లలో ఫజలక్ ఫరూఖీ రెండు వికెట్లు తీయగా.. నవీన్ ఉల్ హక్, రషీద్ ఖాన్, కరీమ్ జనత్ తలో వికెట్ తీసారు.(Afghanistan Cricket Board Twitter)
అనంతరం లక్ష్యచేధనకు దిగిన అఫ్గానిస్థాన్ 19.5 ఓవర్లలో 3 వికెట్లకు 133 పరుగులు చేసి గెలుపొందింది. ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్(49 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 44), ఇబ్రహీం జడ్రాన్(40 బంతుల్లో 3 ఫోర్లతో 38) రాణించగా.. నజిబుల్లా జడ్రాన్(12 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 23 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. (Afghanistan Cricket Board Twitter)
ఇక, ఈ మ్యాచులో క్రికెట్ చరిత్రలో అత్యంత వరస్ట్ రికార్డును నమోదు చేశాడు పాక్ బ్యాటర్ అబ్దుల్లా షఫీఖ్. టీ20ల్లో వరుసగా 4 మ్యాచ్‌ల్లో డకౌటైన తొలి బ్యాటర్‌గా అప్రతిష్టను మూటగట్టుకున్నాడు అబ్దుల్లా షఫీఖ్. అఫ్గానిస్థాన్‌తో ఆదివారం జరిగిన రెండో టీ20లో గోల్డెన్ డకౌట్ అయిన అబ్దుల్లా షఫీఖ్.. ఈ వరస్ట్ ఫీట్ తన పేరిట లిఖించుకున్నాడు. ఫజలక్ ఫరూఖీ వేసిన తొలి ఓవర్ మూడో బంతికే అబ్దుల్లా వికెట్ల ముందు దొరికిపోయాడు.