ఇప్పుడు ఆ రికార్డు కన్నా వరస్ట్ రికార్డును నమోదు చేశాడు. టీ20ల్లో వరుసగా 4 మ్యాచ్‌ల్లో డకౌటైన తొలి బ్యాటర్‌గా అప్రతిష్టను మూటగట్టుకున్నాడు అబ్దుల్లా షఫీఖ్. అఫ్గానిస్థాన్‌తో ఆదివారం జరిగిన రెండో టీ20లో గోల్డెన్ డకౌట్ అయిన అబ్దుల్లా షఫీఖ్.. ఈ వరస్ట్ ఫీట్ తన పేరిట లిఖించుకున్నాడు. ఫజలక్ ఫరూఖీ వేసిన తొలి ఓవర్ మూడో బంతికే అబ్దుల్లా వికెట్ల ముందు దొరికిపోయాడు.