ఈ తరం క్రికెట్లో రెండు కొత్త బంతులు, డీఆర్ఎస్ లు వంటి ఆప్షన్లు బ్యాటర్లకు అనుకూలంగా మారాయ్. అందుకే బ్యాటర్లు.. బౌలర్ల ఆధిపత్యం చెలాయిస్తున్నారు. ఈ రోజుల్లో ఎంత టార్గెట్ అయినా.. ప్రత్యర్ధికి సునాయాసంగా కన్పిస్తోదంటే దానికి కారణం.. ఈ రూల్సే. పవర్ ప్లే నిబంధనలు బేస్ చేసుకుని బ్యాటర్లు వీరవీహారం చేస్తున్నారు.
తాజాగా ఇదే విషయమై పాకిస్థాన్ మాజీ పేసర్, రావల్పిండి ఎక్స్ప్రెస్ షోయబ్ అక్తర్ స్పందించాడు ప్రస్తుతం క్రికెట్లో రూల్స్ తమ తరంలో ఉండి ఉంటే భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ లక్షకు పైగా పరుగులు చేసేవాడని పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ అన్నాడు. ఐసీసీ తీసుకొస్తున్న నిబంధనలు బ్యాటర్లకు అనుకూలంగా ఉంటున్నాయన్నాడు.
ఢిల్లీ కరోనా, ఢిల్లీలో కరోనా వ్యాప్తి, ఢిల్లీ పోలీసుల ట్వీట్, క్రికెట్ న్యూస్, స్పోర్ట్స్ న్యూస్, హిలేరియస్ రిప్లై" width="1600" height="1600" /> ఈ నిబంధనల వల్ల ఆట సహజత్వాన్ని కోల్పోతుందని విమర్శించాడు. ఈ తరం క్రికెట్లోలా రెండు కొత్త బంతులు, డీఆర్ఎస్లు ఉంటే సచిన్ మరిన్నీ పరుగులు చేసేవాడని అభిప్రాయపడ్డాడు.
" సచిన్ టెండూల్కర్.. వసీం అక్రమ్, వకార్ యూనిస్, షేన్ వార్న్, బ్రెట్ లీ, ముత్తయ్య మురళీధరన్ వంటి భీకర బౌలర్లను ఎంతో సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. అందుకే అతన్ని నేను టఫ్ బ్యాటర్ అంటాను. ఇప్పుడున్న నిబంధనలు మా రోజుల్లో ఉండి ఉంటే అతను సులువుగా లక్ష పరుగులకు పైగా చేసేవాడు." అని అక్తర్ చెప్పుకొచ్చాడు.