ONLY ONE MONTH FOR OLYMPICS 2020 CHECK OLYMPIC VILLAGE EXCLUSIVE IMAGES JNK
Olympic Day : టోక్యో ఒలింపిక్స్‌కు సరిగ్గా నెల.. అథ్లెట్ల కోసం నిర్మించిన అత్యద్భుతమైన ఒలింపిక్ విలేజ్ చూశారా?
టోక్యో ఒలింపిక్స్ ప్రారంభానికి సరిగ్గా నెల రోజుల సమయం ఉంది. కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడిన విశ్వ క్రీడలు జులై 23 నుంచి టోక్యోలో ప్రారంభం కానున్నాయి. 11 వేల మంది అథ్లెట్లు ఈ మెగా క్రీడల్లో పాల్గొననున్నారు. వీరి కోసం అత్యంత ఆధునిక సౌకర్యాలతో నిర్మించిన క్రీడా గ్రామాన్ని నిర్వాహకులు మీడియాకు చూపించారు.
అథ్లెట్స్ ఒలింపిక్ విలేజ్‌లో తిరగడానికి.. క్రీడా ప్రాంగణాల వద్దకు చేరుకోవడానికి నిర్వాహక కమిటీ మినీ ఎలక్ట్రిక్ బస్సులను ఏర్పాటు చేసింది. REUTERS/Kim Kyung-Hoon - RC284O97UJZW
2/ 7
ఒలింపిక్స్, పారా ఒలింపిక్స్‌లో పాల్గొనే అథ్లెట్ల కోసం ఒలింపిక్ గ్రామంలో ఏర్పాటు చేసిన రిక్రియేషన్ సెంటర్లలో ఒకటి. ఇక్కడ అథ్లెట్లు సరదాగా కాసేపు సమయాన్ని గడపవచ్చు. REUTERS/Kim Kyung-Hoon - RC274O9QLGV4
3/ 7
నిర్వాహక కమిటీ ఒలింపిక్ గ్రామాన్ని చూపిస్తున్న సమయంలోనే మీడియా కంట పడటానికి ఒలింపిక్స్‌ను వ్యతిరేకిస్తున్న ఆందోళన కారులు బయట బ్యానర్లు ఏర్పాటు చేసిన దృశ్యం. June 20, 2021. REUTERS/Kim Kyung-Hoon - RC234O9H36CQ
4/ 7
అథ్లెట్లు, అధికారులు, సహాయక సిబ్బంది కోసం ఒలింపిక్ గ్రామంలో ఏర్పాటు చేసిన బ్యాంకు. REUTERS/Kim Kyung-Hoon - RC214O92CY8C
5/ 7
ఒలింపిక్ గ్రామంలోని అపార్ట్మెంట్లలో ఏర్పాటు చేసిన బెడ్లు. ఇవి కార్డ్ బోర్డుతో తయారు చేసిన రీసైక్లబుల్ మంచాలు. Akio Kon/Pool via REUTERS - RC244O9GQ0R8
6/ 7
ఒలింపిక్ గ్రామంలో ఏర్పాటు చేసిన భవన సముదాయం. Akio Kon/Pool via REUTERS - RC244O9H9UWX
7/ 7
ఒలింపిక్స్ 2020, పారా ఒలింపిక్స్ 2020 కోసం నిర్మించిన ఒలింపిక్ గ్రామం REUTERS/Kim Kyung-Hoon - RC254O9MB534