ENGvIND : ఇంగ్లాండ్‌ను కట్టడి చేసిన భారత స్పిన్నర్లు.. సెంచరీ మిస్ అయిన హీథర్‌నైట్.. ఇంగ్లాండ్ 269-6

బ్రిస్టల్ కౌంటీ స్టేడియంలో ఇండియా-ఇంగ్లాండ్ మహిళల మధ్య జరుగుతున్న ఏకైక టెస్ట్ తొలి రోజు ఇరు జట్లు సమానంగా ఆధిపత్యం చెలాయించాయి. తొలి రెండు సెషన్లు ఇంగ్లాండ్ బ్యాటర్లు విరుచుకపడగా.. చివరి సెషన్లో భారత స్పిన్నర్లు వికెట్లు తీసి వారి జోరును కట్టడి చేశారు.